31st July 2026

_________

- Saidulu

మేకప్ ప్రొడక్ట్స్ కోసం 8 పర్ఫెక్ట్ స్టోరేజ్ ఆర్గనైజర్ ఐడియాస్!

ఉదయాన్నే కావలసిన మేకప్ ప్రొడక్ట్ దొరక్క వెతుక్కోవడం మనందరికీ అనుభవమే! సరైన ఆర్డర్‌లో మేకప్‌ను సర్దుకుంటే సమయం ఆదాతో పాటు మీ గదికి రాయల్ లుక్ వస్తుంది.

మీ మేకప్ సామాగ్రి ఏముందో బయటికే స్పష్టంగా కనిపించేలా ఆక్రిలిక్ డ్రాయర్లు బాగా ఉపయోగపడతాయి. లిప్‌స్టిక్‌లు, కాంపాక్ట్‌లను క్రమపద్ధతిలో అమర్చుకోవడానికి ఇవి లేటెస్ట్ ట్రెండ్.

ఆక్రిలిక్ ట్రాన్స్‌పరెంట్ ఆర్గనైజర్లు

 తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులను సర్దేందుకు 360-డిగ్రీలు తిరిగే మేకప్ టవర్లు చాలా అనుకూలం. లోషన్లు, పర్ఫ్యూమ్స్, సీరమ్‌లను సులభంగా అందుకోవడానికి ఇవి చక్కటి ఎంపిక.

360° రొటేటింగ్ ఆర్గనైజర్లు

చిన్న గదుల కోసం గోడకు అమర్చే ఫ్లోటింగ్ వ్యానిటీలు ఇప్పుడు బాగా పాపులర్. నేల భాగం ఖాళీగా ఉంటూ, మీ గదికి ఆధునిక మోడ్రన్ అండ్ మినిమలిస్ట్ లుక్‌ను ఇవి అందిస్తాయి.

 ఫ్లోటింగ్ వాల్ వ్యానిటీలు

డ్రాయర్ల లోపల వస్తువులు కలగాపులగం కాకుండా కస్టమ్ డివైడర్లను ఉపయోగించండి. ప్రతి బ్రష్, ఐషేడో ప్యాలెట్‌కు ప్రత్యేక అరలు కేటాయించి పరిశుభ్రంగా ఉంచవచ్చు.

కస్టమ్ డ్రాయర్ డివైడర్లు

టచ్ స్క్రీన్ LED వెలుగుతో కూడిన అద్దాలు, వెనుక దాగివుండే స్టోరేజ్ అరలు నేటి తరం ఎంపిక. సరైన వెలుతురుతో పాటు ప్రొడక్ట్స్ సురక్షితంగా దాచుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

 LED మిర్రర్ & హిడెన్ స్టోరేజ్

గోడల ఖాళీ ప్రదేశాన్ని ఉపయోగించుకుంటూ అక్రిలిక్ షెల్ఫ్‌లు లేదా వాల్ నెయిల్‌పోలిష్ హోల్డర్‌లు అమర్చుకోండి. ఇవి మేకప్ డెకార్‌లా కనిపిస్తూ స్పేస్ సేవ్ చేస్తాయి.

వర్టికల్ ఆక్రిలిక్ వాల్ ర్యాక్స్

తరచూ వాడే ఐషాడోలు, కాంపాక్ట్ బాక్సులకు చిన్న అయస్కాంతాలు అంటించి మాగ్నెటిక్ బోర్డుపై అమర్చవచ్చు. ఇది వాల్ ఆర్ట్ లాగా కనిపిస్తూనే సులభంగా అందుబాటులో ఉంటుంది.

మాగ్నెటిక్ మేకప్ బోర్డులు

చక్రాలు ఉండే రోలింగ్ ట్రాలీలు లేదా మూవబుల్ కార్ట్‌లలో మేకప్ బాక్స్‌లను ఉంచితే గదిలో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇది మల్టీ-ఫంక్షనల్ డిజైన్ ట్రెండ్!

పోర్టబుల్ రోలింగ్ ట్రాలీలు