31st July 2026

_________

- Saidulu

PCOD ఉన్నవారికి ఉదయాన్నే తినాల్సిన ఆహారాలు

పిసిఓడి సమస్యతో క్రమరహిత రుతుక్రమం మరియు బరువు పెరుగుతున్నారా? సరైన ఉదయపు ఆహారంతో హార్మోన్లను సహజంగా సమతుల్యం చేసుకోండి!

ఉదయాన్నే పరగడుపున పరగడుపున ఖాళీ కడుపుతో చియా గింజల నీరు తాగాడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది మరియు ఇన్సులిన్ స్పైక్స్ నియంత్రణలో ఉంటాయి.

గోరువెచ్చని చియా సీడ్స్ నీరు

రాత్రి నానబెట్టిన బాదం, వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆండ్రోజెన్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

నానబెట్టిన బాదం మరియు వాల్‌నట్స్

మొలకెత్తిన విత్తనాలలో ప్రొటీన్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి అతిగా తినకుండా నిరోధిస్తాయి.

మొలకెత్తిన పెసర్లు

బియ్యం దోసెలకు బదులుగా ప్రొటీన్ ఎక్కువగా ఉండే పెసరట్టు లేదా సెనగపిండి చిల్లా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.

పెసరట్టు లేదా బేసన్ చిల్లా

గుడ్లలో ఉండే హై-క్వాలిటీ ప్రొటీన్ మరియు హెల్దీ ఫ్యాట్స్ ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయకుండా శక్తిని అందిస్తాయి.

ఉడకబెట్టిన గుడ్లు

ప్రాసెస్ చేసిన ఓట్స్ కాకుండా రోల్డ్ ఓట్స్ లేదా జొన్నలతో చేసిన ఉప్మాలో ఫైబర్ ఎక్కువగా ఉండి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.

కూరగాయల ఓట్స్ లేదా జొన్న ఉప్మా

ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి, గుట్ హెల్త్ మెరుగుపరచడానికి మరియు హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది.

గ్రీక్ యోగర్ట్ / ఇంట్లో చేసిన పెరుగు

ఉదయం దాల్చినచెక్క నీరు లేదా టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది మరియు రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

దాల్చినచెక్క (Cinnamon) టీ

మంచి ఆహారంతో పాటు రోజుకు 30 నిమిషాల నడక, ఒత్తిడి తగ్గించుకోవడం మరియు 8 గంటల నిద్ర PCOD ని వేగంగా అదుపులోకి తెస్తాయి!

శారీరక శ్రమ & జీవనశైలి మార్పులు