రాత్రి నిద్ర లేచాక మీ చర్మానికి తక్షణ కాంతి, నిగారింపు రావడానికి పాటించాల్సిన సింపుల్ మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకుపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
గోరువెచ్చని నీరు
ఉదయం ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రంధ్రాలు బిగువుగా మారుతాయి.
చల్లటి నీటితో కడగడం
చర్మానికి సరిపడే మైల్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మలినాలను తొలగించి, మృదువుగా ఉంచుతుంది.
జెంటిల్ క్లెన్సర్
ఒక ఐస్ క్యూబ్‌ను కాటన్ బట్టలో చుట్టి ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తే ఉబ్బు తగ్గి, మెరుపు వస్తుంది.
ఐస్ క్యూబ్ మసాజ్
ముఖం కడుక్కున్న వెంటనే విటమిన్ సి సీరమ్ రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు కూడా క్రమంగా తగ్గుతాయి.
విటమిన్ సి సీరమ్
చర్మం తత్త్వానికి తగిన మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇది తేమను లాక్ చేసి రోజంతా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
తేలికపాటి మాయిశ్చరైజర్
ఇంట్లో ఉన్నా లేదా బయటకు వెళ్లినా సన్‌స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. ఇది UV కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది.
సన్‌స్క్రీన్ తప్పనిసరి
ఉదయం పూట పాలకు బదులు గ్రీన్ టీ తాగితే యాంటీ ఆక్సిడెంట్లు అంది చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.
గ్రీన్ టీ అలవాటు
కొద్దిసేపు ప్రాణాయామం చేసి, చిరునవ్వు చిందించండి. ఒత్తిడి తగ్గి ముఖంలో సహజమైన మెరుపు సొంతం అవుతుంది.
యోగా మరియు నవ్వు