30th July 2026

_________

- Saidulu

ఆఫీస్ ఉద్యోగులు హెల్తీగా, ఫిట్‌గా ఉండాలంటే... బెస్ట్ డైట్ ప్లాన్ ఇదే !

 గంటల తరబడి డెస్క్ ముందే కూర్చుని పనిచేసే ఉద్యోగుల్లో అలసట, బరువు పెరగడం సాధారణం. ఈ చిన్న ఆహార మార్పులతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండండి!

ఉదయం ఆఫీసు హడావుడిలో బ్రేక్‌ఫాస్ట్ మానవద్దు. పెసరెట్టు, ఇడ్లీ లేదా గుడ్లు వంటి ప్రొటీన్, ఫైబర్ ఉన్న టిఫిన్ తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

పోషకాలతో కూడిన అల్పాహారం

ఉదయం 11 గంటల సమయంలో ఆకలి వేస్తే జంక్ ఫుడ్ తినకుండా బాదం, వాల్‌నట్స్ లేదా ఒక పండు తినండి. ఇవి మైండ్ ఫ్రెష్‌గా ఉంచి, ఆకలిని అదుపు చేస్తాయి.

మిడ్-మార్నింగ్ హెల్తీ స్నాక్స్

లంచ్ బాక్స్‌లో సగం కూరగాయలు, పావు భాగం బ్రౌన్ రైస్/రొట్టె, పావు భాగం పప్పు లేదా చికెన్ ఉండాలి. ఇది మధ్యాహ్నం నిద్రమబ్బు రాకుండా చూస్తుంది.

సమతుల్య మధ్యాహ్న భోజనం

డెస్క్ దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకుని రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. శరీరం డీహైడ్రేట్ అయితే తలనొప్పి, అలసట వస్తాయి. మజ్జిగ కూడా చాలా మంచిది.

రోజంతా తగినంత నీరు

సాయంత్రం సమోసా, బిస్కెట్లకు బదులుగా గుప్పెడు ఉడకబెట్టిన సెనగలు, మఖానా లేదా మొలకెత్తిన విత్తనాలు తింటే శరీరానికి మంచి బలం, ఎనర్జీ లభిస్తాయి.

సాయంత్రం హెల్తీ స్నాప్స్

 ఒత్తిడి తగ్గించుకోవడానికి పదే పదే టీ, కాఫీలు తాగడం మానండి. వీటి స్థానంలో గ్రీన్ టీ, నిమ్మరసం లేదా కొబ్బరినీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

కేఫీన్ నియంత్రణ 

రాత్రి 8 గంటల లోపే తేలికపాటి భోజనం పూర్తి చేయాలి. సూప్, వేయించిన కూరగాయలు, లేదా గ్రిల్డ్ పనీర్ తినడం వల్ల జీర్ణక్రియ బాగుండి మంచి నిద్ర పడుతుంది.

రాత్రి 8 గంటల లోపే డిన్నర్

సరిగ్గా తింటూనే, గంటకోసారి డెస్క్ నుండి లేచి 5 నిమిషాలు నడవండి. చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల నడుము, మెడ నొప్పులు దరిచేరవు.

భోజనంతో పాటు కాస్త కదలిక

కఠినమైన డైటింగ్ కంటే రోజూ సరైన సమయంలో పోషకాహారం తినడమే ముఖ్యం. చిన్న ఆహార మార్పులతో ఉద్యోగంలో ఒత్తిడి తగ్గించుకుని ఫిట్‌గా జీవించండి!