29th July 2026

_________

- Saidulu

పిల్లలో స్కూల్ భయాన్ని తగ్గించే చిట్కాలు ...

కొంతమంది పిల్లలు స్కూల్‌కి వెళ్లాలంటే భయపడుతుంటారు. ఈ సమస్యను సులభంగా తగ్గించే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి!

పిల్లల్లో స్కూల్ భయమా?

పిల్లలు ఎందుకు భయపడుతున్నారో ప్రేమగా మాట్లాడి కారణం కనుగొనండి. టీచర్ల భయమా లేక ఫ్రెండ్స్ సమస్యనా తెలుసుకోవాలి.

భయానికి కారణం తెలుసుకోండి!

స్కూల్ ఎంత సరదాగా ఉంటుందో చెప్పండి. కొత్త స్నేహితులు దొరుకుతారని, ఆటలు ఆడుకోవచ్చని పిల్లల్లో ఉత్సాహం నింపండి.

పాజిటివ్‌గా మాట్లాడండి!

పాఠశాల పునఃప్రారంభానికి ముందే స్కూల్‌కి తీసుకెళ్లండి. తరగతి గదిని చూపిస్తే పిల్లల్లో కొత్త ప్రదేశంపై భయం తొలగిపోతుంది.

ముందే స్కూల్ చూపించండి!

స్కూల్‌కి వెళ్లే వాతావరణాన్ని ఇంట్లోనే ప్రాక్టీస్ చేయించండి. పుస్తకాలు సర్దడం, లంచ్ బాక్స్ తెరుచుకోవడం అలవాటు చేయండి.

ఇంటి వద్దే ప్రిపరేషన్!

మీ పిల్లల క్లాస్‌మేట్స్ లేదా పక్క ఇళ్ల పిల్లలతో స్కూల్ వెళ్లేలా ఏర్పాట్లు చేయండి. కలిసి వెళ్తే భయం ఇట్టే మాయమవుతుంది.

స్నేహితులతో పరిచయం!

స్కూల్ పేరు చెప్పి బెదిరించడం లేదా కోప్పడటం చేయకండి. ఇది పిల్లల్లో భయాన్ని మరింత పెంచుతుంది, కాస్త ఓపికగా ఉండండి.

ఒత్తిడికి గురి చేయవద్దు!

పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ లేదా లంచ్ బాక్స్‌లో పెట్టి ఇవ్వండి. స్కూల్ టైమ్‌లో అది వారికి ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది.

ఇష్టమైన లంచ్ బాక్స్!

స్కూల్ అయిపోయాక అమ్మ లేదా నాన్న బయట వెయిట్ చేస్తారనే భరోసా ఇవ్వండి. ఈ నమ్మకం పిల్లల్లో ధైర్యాన్ని పెంచుతుంది.

రోజూ మీరే రిసీవ్ చేసుకోండి!

పిల్లలు భయం వీడి రోజూ స్కూల్‌కి వెళ్తే చిన్న బహుమతి ఇచ్చి అభినందించండి. వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది!

ప్రతి చిన్న ప్రయత్నాన్ని మెచ్చుకోండి!