28th July 2026

_________

- Saidulu

హెయిర్ డై  ఎక్కువ రోజులు  ఉండేందుకు చిట్కాలు ...

హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత అది ఎక్కువ రోజులు తాజాగా మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్ చిట్కాలు!

హెయిర్ డై నిలవడానికి

కలర్ వేసుకున్న వెంటనే కనీసం 48 నుండి 72 గంటల వరకు తలస్నానం చేయకూడదు. అప్పుడే రంగు కుదుళ్లకు పడుతుంది.

వెంటనే తలస్నానం వద్దు

సల్ఫేట్ లేని (Sulfate-free) షాంపూలను మాత్రమే వాడండి. ఇవి జుట్టు రంగు త్వరగా ఫేడ్ కాకుండా కాపాడతాయి.

సల్ఫేట్ లేని షాంపూ

వేడి నీళ్లతో తలస్నానం చేస్తే రంగు త్వరగా పోతుంది. ఎప్పుడూ చల్లని లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడండి.

గోరువెచ్చని నీరు

రంగు వేసిన జుట్టు కోసం ప్రత్యేకంగా లభించే కలర్-ప్రొటెక్ట్ కండీషనర్‌ని వాడి తేమను అలాగే ఉంచండి.

కలర్ ప్రొటెక్ట్ కండీషనర్

హెయిర్ డ్రైయర్స్, స్ట్రైటెనర్స్ వాడే ముందు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే రాస్తే కలర్ దెబ్బతినకుండా ఉంటుంది.

హీట్ ప్రొటెక్షన్

ఎండలోకి వెళ్లేటప్పుడు టోపీ పెట్టుకోవడం లేదా హెయిర్ యూవీ స్ప్రే వాడడం వల్ల ఎండకు రంగు మారదు.

యూవీ కిరణాల నుండి రక్షణ

రోజూ తలస్నానం చేయడం మానుకోండి. వారానికి 2 లేక 3 సార్లు మాత్రమే తలస్నానం చేయడం వల్ల కలర్ నిలుస్తుంది.

వారానికి ఒకసారే

వారానికి ఒకసారి కుంకుమపువ్వు లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఆయిల్ మసాజ్

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ హెయిర్ డై నెలల తరబడి తాజాగా, ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది!

మెరిసే కురులు