23rd July 2026

_________

- Saidulu

ఉదయాన్నే ప్రోటీన్ అందించే ఈజీ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాస్... ఇవిగో!

పెసరపప్పును రుబ్బి క్షణాల్లో అట్లు వేసుకోవచ్చు. ఇందులో ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉండి పొట్ట నిండుగా ఉంచుతుంది, బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. 

మూంగ్ దాల్ చిల్లా

తురిమిన పనీర్‌లో ఉల్లి, టమోటా, మసాలాలు వేసి వేయించి బ్రౌన్ బ్రెడ్‌పై టోస్ట్ చేయండి. 10 నిమిషాల్లో 18 గ్రాముల ప్రోటీన్ మీ సొంతం చేసుకోవచ్చు.

పనీర్ భూర్జీ టోస్ట్

రెండు గుడ్లకు కూరగాయలు చేర్చి ఆమ్లెట్ లేదా భూర్జీ చేసుకోండి. ఇది శరీరానికి నాణ్యమైన ప్రోటీన్ అందించే వేగవంతమైన, అత్యంత సులువైన పద్ధతి.

ఎగ్ ఆమ్లెట్ / స్క్రాంబుల్

మొలకెత్తిన పెసలు, శనగలలో నిమ్మరసం, ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు చల్లి తీసుకోండి. వండాల్సిన అవసరం లేని, అత్యంత పోషకమైన సహజమైన బ్రేక్‌ఫాస్ట్ ఇది. 

మొలకల ప్రొటీన్ చాట్

గ్రీక్ యోగర్ట్‌లో బాదం, జీడిపప్పు, చియా విత్తనాలు, తేనె కలిపి తీసుకోండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది.

గ్రీక్ పెరుగు & నట్స్ బోల్

ఓట్స్‌ను పాలు లేదా నీటిలో ఉడికించి, ఒక స్పూన్ వేరుశెనగ వెన్న (పీనట్ బటర్) కలపండి. ఇది రోజంతా ఆకలి వేయకుండా, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

పీనట్ బటర్ ఓట్స్

వేయించిన శనగపిండి (సత్తు) లేదా ప్రోటీన్ పౌడర్‌ను మజ్జిగ లేదా పాలలో కలిపి తాగండి. సమయం లేని బిజీ ఉదయాల్లో ఇది 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్‌ఫుడ్. 

సత్తు హెల్తీ స్మూతీ