21st July 2026

__________

- Saidulu

చిన్న వంటగదిని కూడా విశాలంగా మార్చే మాడ్రన్ కిచెన్ ఆర్గనైజర్ ఐడియాస్... 

వంటిల్లు ఎంత అందంగా ఉన్నా సామాన్లు సర్దుకోవడం పెద్ద సవాలే. ఈ అధునాతన ఆర్గనైజర్లతో మీ కిచెన్‌ను చాలా సులభంగా, స్టైలిష్‌గా మార్చుకోండి!

చెక్కతో చేసిన ఈ డ్యూయల్-టియర్ ర్యాక్ ప్లాట్‌ఫారమ్‌కు క్లాసీ లుక్ ఇస్తుంది. అడుగున ఉన్న చిన్న డ్రాయర్‌లో విడి వస్తువులను దాచుకోవచ్చు.

క్లాసీ డ్యూయల్-టియర్ వుడెన్ ర్యాక్

మెటల్ ఆర్చ్ డిజైన్‌తో వచ్చే ఈ రెండు పొరల ఆర్గనైజర్ మసాలా డబ్బాలను అమర్చడానికి చాలా బాగుంటుంది. ఇది కిచెన్‌కు ప్రీమియమ్ లుక్ ఇస్తుంది.

మోడర్న్ ఆర్చ్ స్పైస్ ఆర్గానైజర్

360 డిగ్రీలు తిరిగే ఈ చెక్క రొటేటర్ ద్వారా ఏ మసాలా జార్ అయినా క్షణాల్లో అందుకోవచ్చు. చిన్న కిచెన్‌లలో స్పేస్ సేవ్ చేసే బెస్ట్ ఐడియా!

360° వుడెన్ లేజీ సుసాన్

గాజు బుడ్ల డిజైన్‌తో ఉండే ఈ స్పైస్ హోల్డర్ చూడటానికి డిఫరెంట్‌గా ఉంటుంది. తక్కువ స్థలంలో ఎక్కువ మసాలా సీసాలను చక్కగా అమర్చుకోవచ్చు.

రొటేటింగ్ స్పైస్ కరుసెల్ ట్రీ

నూనె సీసాలు, గ్లాస్ జార్లు ఒకే చోట అమర్చుకునే వుడెన్ ఆర్గనైజర్. వంట చేసేటప్పుడు కావాల్సినవన్నీ ప్లాట్‌ఫారమ్‌పైనే అందుబాటులో ఉంటాయి.

మల్టీ-ఫంక్షనల్ కిచెన్ ఆర్గనైజర్

జ్యూట్ మెటీరియల్‌తో ఊయల ఆకారంలో ఉండే ఈ ఆర్గనైజర్ ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఆరారగా, ఫ్రెష్‌గా ఉంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

జ్యూట్ హామోక్ వెజిటబుల్ ర్యాక్

కిచెన్ కౌంటర్ స్పేస్ వృథా కాకుండా ఉండటానికి ఈ 3-టైర్ తాడు బుట్టలను పైకప్పుకి వేలాడదీయవచ్చు. తాజా పండ్లను నిల్వ చేయడానికి పర్ఫెక్ట్!

3-టైర్ హ్యాంగింగ్ జ్యూట్ బాస్కెట్

సరైన ఆర్గనైజర్లను ఎంచుకోవడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాక వంటగది ఎంతో శుభ్రంగా ఉంటుంది. మీ కిచెన్ స్టైల్‌కు తగ్గదాన్ని ఎంచుకోండి!

అందమైన, శుభ్రమైన కిచెన్ మీ సొంతం