నడుము వరకు ఫిట్‌గా, కింద ఫ్లేర్‌తో ఉండే అలియా కట్ కుర్తాలు అందమైన సిల్హౌట్‌ను ఇస్తాయి. రోజువారీ నుంచి చిన్న వేడుకల వరకు చక్కగా నప్పుతాయి.
క్లాసిక్ అలియా కట్ కుర్తా
ఎక్కువ ఫ్లేర్‌తో వచ్చే అలియా కట్ అనార్కలి డ్రెస్‌లు పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పండుగల్లో రాయల్ లుక్ అందిస్తాయి. జుమ్కాలతో మరింత అందంగా కనిపిస్తాయి.
అనార్కలి అలియా కట్
కాటన్ ఫ్యాబ్రిక్‌తో తయారైన అలియా కట్ డ్రెస్‌లు వేసవికి బెస్ట్ ఎంపిక. తేలికగా ఉండి రోజంతా సౌకర్యంగా ఉంటాయి.
కాటన్ అలియా కట్ డ్రెస్
ఫ్లోరల్, బ్లాక్ ప్రింట్, బూటీ డిజైన్లతో వచ్చే అలియా కట్ డ్రెస్‌లు క్యాజువల్ అవుటింగ్స్, ఆఫీస్ వేర్‌కు పర్ఫెక్ట్గా సరిపోతాయి.
ప్రింటెడ్ అలియా కట్
మెడ, స్లీవ్స్‌పై అందమైన ఎంబ్రాయిడరీతో వచ్చే అలియా కట్ డ్రెస్‌లు పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఎంబ్రాయిడరీ అలియా కట్
అదే డిజైన్‌లో కుర్తా, ప్యాంట్ లేదా పలాజోతో వచ్చే కో-ఆర్డ్ సెట్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. మోడ్రన్ ఎథ్నిక్ లుక్‌ను అందిస్తాయి.
అలియా కట్ కో-ఆర్డ్ సెట్
పింక్, లావెండర్, మింట్ గ్రీన్, పీచ్ వంటి పాస్టెల్ రంగుల అలియా కట్ డ్రెస్‌లు 2026 ఫ్యాషన్ ట్రెండ్‌లో ప్రముఖ స్థానంలో ఉన్నాయి.
పాస్టెల్ కలర్ ట్రెండ్
అలియా కట్ డ్రెస్‌కు జుమ్కాలు, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, పోట్లీ బ్యాగ్, బ్లాక్ హీల్స్ లేదా జుట్టీ జత చేస్తే మరింత ఎలిగెంట్ లుక్ వస్తుంది.
స్టైలింగ్ టిప్స్