ప్రతిరోజూ మొక్కల ఆకులను, కాడలను జాగ్రత్తగా పరిశీలించండి. ఆకుల వెనుక భాగంలో గుడ్లు ఉన్నాయేమో చూడటం చాలా ముఖ్యం.
మొక్కలను గమనించండి
మొక్కలపై గొంగళి పురుగులు కనిపిస్తే, చేతి తొడుగులు ధరించి వాటిని తీసి వేరే చోట పడేయండి. ఇది అత్యంత సులభమైన మార్గం.
పురుగులను తొలగించండి
లీటరు నీటిలో కొంచెం వేప నూనె (Neem Oil), కొన్ని చుక్కల డిష్ వాష్ కలిపి మొక్కలపై స్ప్రే చేయండి. ఇది పురుగులను దూరం చేస్తుంది.
వేప నూనె స్ప్రే
పులిసిన మజ్జిగలో నీరు కలిపి మొక్కలపై చల్లడం వల్ల గొంగళి పురుగులు ఆకులను తినకుండా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
మజ్జిగ ద్రావణం
కొద్దిగా పసుపు, కారం పొడి కలిపి మొక్కల చుట్టూ చల్లడం లేదా నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల పురుగులు దూరంగా ఉంటాయి.
పసుపు - కారం మిశ్రమం
మొక్కల పక్కన బంతి (Marigold) వంటి పువ్వుల మొక్కలను నాటండి. వీటి వాసనకు పురుగులు మొక్కలకు దూరంగా ఉంటాయి.
తోడు మొక్కలు
మొక్కలపై దుమ్ము, ధూళి లేకుండా తరచుగా నీటితో కడగండి. ఆరోగ్యకరమైన మొక్కలపై తెగుళ్ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.
మొక్కలను శుభ్రం చేయండి
ఎండిపోయిన ఆకులు, పువ్వులను ఎప్పటికప్పుడు కత్తిరించండి. వీటి వల్లే పురుగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు ప్రూనింగ్
సహజమైన పద్ధతులతో మీ తోటను సంరక్షించుకోండి. ఈ చిట్కాలను పాటిస్తూ మీ మొక్కలను పచ్చగా, ఆరోగ్యంగా పెంచుకోండి!