ప్రతి శుభకార్యంలో మహిళల చెవుల అందాన్ని రెట్టింపు చేసేవి మాటీలు. సాంప్రదాయానికి సరికొత్త హంగులు అద్దే అద్భుత కలెక్షన్లు ఇవి.
సింపుల్‌గా, ఎలిగెంట్‌గా మెరిసిపోవాలనుకునే వారి కోసం ఈ లైట్ వెయిట్ సింగిల్ చైన్ మాటీలు పర్ఫెక్ట్ ఛాయిస్!
సింగిల్ లైన్ మాటీలు
హార్ట్-లీఫ్ షేప్స్ కలయికతో, మధ్యలో కెంపులు, పచ్చల రాళ్లు పొదిగిన ఈ డిజైన్ సాంప్రదాయ పట్టుచీరలపైకి రాయల్ లుక్ ఇస్తుంది.
హార్ట్-లీఫ్ ఫినిషింగ్
నెమలి రూపులతో వరుసగా అమర్చిన గోల్డ్ వర్క్, చిన్న ఎరుపు రంగు పూసల మెరుపు ఈ డిజైన్‌ను పెళ్లికూతుళ్లకు హాట్ ఫేవరెట్‌గా మార్చింది.
రాయల్ పీకాక్ డిజైన్
సన్నని బాక్స్ చైన్ కింద అందమైన బంగారు మొగ్గల నగిషీలు ఉన్న ఈ మోడల్, సింపుల్ అండ్ క్లాసీ లుక్ కోరుకునే వారి కోసం.
ఎలిగెంట్ చైన్ మోడల్
డిజైన్ మధ్యలో పచ్చ, కెంపు స్టోన్స్ అల్లేసి, చూడగానే కళ్లని కట్టేసేలా ఉన్న ఈ మోడల్ ఏ పండగకైనా పర్ఫెక్ట్ ఛాయిస్.
మ్యాచింగ్ ఫ్లోరల్ ఎంబెడెడ్
సన్నని ఫ్లాట్ చైన్‌పై చిన్న చిన్న వైట్ స్టోన్స్ అమర్చిన ఈ 22k గోల్డ్ మాటీలు ఇండో-వెస్ట్రన్ దుస్తులపైకి కూడా మ్యాచ్ అవుతాయి.
మోడ్రన్ డైమండ్ స్టడ్డ్
రెండు వైపులా చిన్న ఆకుల వరుసలతో, వెనుక వైపు హెయిర్ పిన్ హుక్తో వచ్చే ఈ డిజైన్ బరువు లేకుండా రోజంతా సౌకర్యంగా ఉంటుంది.
క్లాసిక్ లీఫ్ చైన్
చిన్న చిన్న మువ్వలు లేదా బుట్టల డిజైన్ వేలాడుతూ ఉండే ఈ మోడల్స్, నడుస్తున్నప్పుడు భలే శబ్దాన్ని ఇస్తాయి.
బుట్టల మాటీలు
మీ బుట్టలు లేదా జుంకాలకు ఈ లేటెస్ట్ మాటీలను జత చేసి, ఈ పండగ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించండి!