టీ టైమ్‌కు లేదా బ్రేక్‌ఫాస్ట్‌కు సాఫ్ట్, స్పాంజీ బనానా బ్రెడ్ కావాలా? ఈ సింపుల్ రెసిపీని తప్పక ట్రై చేయండి.
పండిన అరటిపండ్లు, మైదా, చక్కెర, వెన్న, గుడ్లు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిల్లా ఎసెన్స్.
అరటిపండ్లను బాగా మెత్తగా మాష్ చేసి అందులో కరిగించిన వెన్న, చక్కెర, గుడ్లు, వెనిల్లా ఎసెన్స్ వేసి కలపండి.
మరో గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి సిద్ధం చేసుకోండి.
ఇప్పుడు పొడి మిశ్రమాన్ని అరటి మిశ్రమంలో కొద్దికొద్దిగా వేసి మెల్లగా కలపండి. ఎక్కువగా కలపకుండా జాగ్రత్తపడండి.
బ్యాటర్‌ను వెన్న రాసిన బ్రెడ్ టిన్‌లో పోసి పైభాగాన్ని సమంగా చేసి అవసరమైతే అరటి ముక్కలతో అలంకరించండి.
180°C వద్ద ముందుగా వేడి చేసిన ఓవెన్లో 45–50 నిమిషాలు బేక్ చేయండి. టూత్‌పిక్ శుభ్రంగా వస్తే బ్రెడ్ సిద్ధం.
ఓవెన్ నుంచి తీసిన తర్వాత 10 నిమిషాలు చల్లారనివ్వండి. తర్వాత టిన్ నుంచి తీసి పూర్తిగా చల్లారాక ముక్కలు కట్ చేయండి.
వెన్న, తేనె లేదా పీనట్ బటర్‌తో బనానా బ్రెడ్ సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది. టీ, కాఫీతో చక్కగా సరిపోతుంది.
సాఫ్ట్‌గా, స్పాంజీగా ఉండే హోమ్మేడ్ బనానా బ్రెడ్‌ను ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించే రుచి మీ సొంతం!