10th July 2026

__________

- Saidulu

మగువల హెయిర్ స్టైల్‌ని మరింత ఆకర్షణీయంగా చేసే ఫ్లవర్ క్లిప్స్.. లుక్కు అదిరిపోతుంది ..!

క్యాజువల్ అవుట్‌ఫిట్ అయినా, గ్రాండ్ ట్రెడిషనల్ లుక్ అయినా.. చిటికెలో హెయిర్ స్టైల్‌కి రిచ్ లుక్ ఇచ్చే 'ఫ్లవర్ క్లా క్లిప్స్' ఇప్పుడు అమ్మాయిల హాట్ ఫేవరెట్.

 నిజమైన పొద్దుతిరుగుడు పువ్వులా మెరిసిపోయే ఈ క్లిప్, మీ క్యాజువల్ జీన్స్ లేదా వైట్ టాప్స్‌పైకి అదిరిపోయే వైబ్స్ ఇస్తుంది.

బ్రైట్ సన్‌ఫ్లవర్ బ్యూటీ

మెష్ ఫాబ్రిక్‌తో చేసిన పెద్ద గులాబీ పువ్వు క్లిప్, హాఫ్-అప్ హెయిర్ స్టైల్‌కి మరియు డేట్ నైట్ అవుట్‌ఫిట్స్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్.

 ఎలిగెంట్ రోజ్ క్లిప్

డెనిమ్ క్లాత్‌తో చేసిన చిన్న చిన్న బ్లూ రోజెస్ క్లిప్ ఇది. కాలేజ్ గర్ల్స్ క్యూట్ అండ్ వెస్ట్రన్ లుక్ కోసం దీనిని తెగ ఇష్టపడతారు.

కూల్ డెనిమ్ కలెక్షన్

సిల్కీ శాటిన్ రిబ్బన్ మరియు రోజ్ కాంబినేషన్ క్లిప్, మీ మెస్సీ బన్‌కి ఒక రాయల్ మరియు క్లాసీ ఫినిషింగ్‌ను ఇస్తుంది.

రాయల్ శాటిన్ క్లాసిక్

 వైట్ అండ్ ఎల్లో కాంబోలో వచ్చే ఈ ప్లుమేరియా క్లిప్స్, సమ్మర్ బీచ్ వైబ్స్ లేదా క్యాజువల్ డే-అవుట్స్‌కి సూపర్ కూల్‌గా ఉంటాయి.

హవాయిన్ ఫ్లవర్ మ్యాజిక్

 రిబ్బన్ నోట్‌తో కిందకు వేలాడే అందమైన వైట్ ట్యులిప్ ఫ్లవర్స్ క్లిప్, సింపుల్ హెయిర్ స్టైల్‌ను కూడా ఎంతో రిచ్‌గా మారుస్తుంది.

లవ్లీ ట్యులిప్ డిజైన్

పొడవైన క్రిస్టల్ పూసల ట్యాసెల్స్‌తో ఉన్న రెడ్ లిల్లీ క్లిప్, ట్రెడిషనల్ లెహంగాలు మరియు పట్టుచీరలపైకి అద్భుతంగా ఉంటుంది. 

గ్రాండ్ లిల్లీ ట్యాసెల్స్

 పూల డిజైన్ కి ముత్యాలు, మెరిసే స్టోన్స్ జతచేసిన ఈ లగ్జరీ క్లిప్స్ పెళ్లికూతుళ్లకు, పట్టుచీరల పైకి అద్భుతంగా సరిపోతాయి.

లగ్జరీ పర్ల్ స్టైల్

గులాబీ మరియు తెలుపు రంగుల ఆర్కిడ్ల కలయికతో ఉన్న ఈ రిచ్ క్లిప్, మీ మెస్సీ బన్‌కి అసలైన పూల మాల అలంకరించిన అనుభూతిని ఇస్తుంది.

మల్టీ-ఫ్లవర్ బొకే

ఏ హెయిర్ టైప్ కైనా సరిపోయే ఈ ఫ్లవర్ క్లా క్లిప్స్ మీ వార్డ్‌రోబ్‌లో ఉంటే, కేవలం 10 సెకన్లలో స్టైలిష్ లుక్ మీ సొంతం!