ఓట్స్–ఖర్జూరం లడ్డూ రుచికరమైన స్నాక్. ఇందులోని ఫైబర్, సహజ పోషకాలు పేగుల ఆరోగ్యానికి తోడ్పడే సమతుల్య ఆహారంలో భాగం.
ఓట్స్, గింజలు తీసేసిన ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు), కొద్దిగా నెయ్యి మరియు యాలకుల పొడి సిద్ధం చేసుకోండి.
ముందుగా ఒక పాన్ తీసుకుని నూనె లేదా నెయ్యి లేకుండా ఓట్స్ దోరగా, మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
ఓట్స్ వేయించడం
అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి బాదం, జీడిపప్పు ముక్కలను క్రంచీగా అయ్యే వరకు వేయించి చల్లార్చండి.
వేయించిన ఓట్స్, డ్రై ఫ్రూట్స్‌ను మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
గింజలు లేని ఖర్జూరాలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇది లడ్డూలు చుట్టడానికి బైండింగ్లా పనిచేస్తుంది.
ఒక గిన్నెలో ఓట్స్ పొడి, ఖర్జూరం పేస్ట్, యాలకుల పొడి వేసి అంతా బాగా కలిసేలా చేత్తో గట్టిగా కలుపుకోవాలి.
చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుంటే హెల్దీ లడ్డూలు సిద్ధం.
ఓట్స్‌లోని ఫైబర్, ఖర్జూరంలోని యాంటీఆక్సిడెంట్లు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి.
చక్కెర లేని ఈ హెల్దీ లడ్డూలను రోజూ ఒకటి తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని హెల్త్ రెసిపీల కోసం ఫాలో అవ్వండి!