అప్పం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం. కొబ్బరి రుచితో తయారయ్యే ఈ టిఫిన్ తేలికగా జీర్ణమవుతుంది.
బియ్యం, కొబ్బరి తురుము, ఉడికించిన అన్నం, మెంతులు, ఈస్ట్ లేదా పులిసిన పిండి, ఉప్పు, నీరు సిద్ధంగా ఉంచుకోండి.
బియ్యం, మెంతులను నానబెట్టి కొబ్బరి, అన్నంతో కలిసి మెత్తగా రుబ్బండి. తర్వాత ఈస్ట్ వేసి పిండిని పులియనివ్వండి.
పిండిని 8–10 గంటలు లేదా బాగా ఉబ్బే వరకు పులియనివ్వండి. అప్పుడే అప్పం మెత్తగా, స్పాంజీ టెక్స్చర్‌తో వస్తుంది.
అప్పం పాన్ వేడి చేసి పిండిని పోసి పాన్‌ను గుండ్రంగా తిప్పండి. అంచులు పలుచగా, మధ్య భాగం మందంగా ఉండేలా చేయండి.
మూతపెట్టి తక్కువ మంటపై 2–3 నిమిషాలు ఉడికించండి. అప్పం అంచులు కరకరలాడుతూ, మధ్య భాగం మెత్తగా సిద్ధమవుతుంది.
వెజిటబుల్ స్ట్యూ, కొబ్బరి పాలు, ఆలూ కుర్మా లేదా చికెన్ స్ట్యూతో అప్పం తింటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
సులభంగా తయారయ్యే అప్పం ఉదయం అల్పాహారానికి అద్భుతమైన ఎంపిక. సంప్రదాయ రుచితో పాటు కుటుంబమంతా ఇష్టపడే వంటకం.