30th June 2026

__________

- Saidulu

చర్మం, జుట్టు పొడిబారకుండా ఉంచే విటమిన్ C జ్యూసులు

ఈ రోజుల్లో పొడి చర్మం, జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. వీటికి శాశ్వత పరిష్కారం ఇచ్చే విటమిన్ C జ్యూసుల గురించి ఇప్పుడు చూద్దాం.

ఉసిరిలో విటమిన్ C కొండంత ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, జుట్టు కుదుళ్లను బలంగా మార్చి పొడిబారకుండా కాపాడుతుంది.

ఉసిరి రసం

ఆరెంజ్ జ్యూస్ నిత్యం తాగడం వల్ల చర్మంలో కొల్లాజెన్ పెరుగుతుంది. ఇది చర్మంపై ముడతలను తగ్గించి, సహజమైన కాంతిని, తేమను అందిస్తుంది.

కమలా ఫలం రసం

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరిచి మెరిపిస్తుంది.

నిమ్మరసం

బొప్పాయిలో విటమిన్ C తో పాటు పపైన్ ఉంటుంది. ఈ జ్యూస్ చర్మంపై పొట్టు రాలడాన్ని తగ్గించి, స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

బొప్పాయి రసం

పైpineapple జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాల దెబ్బతినకుండా చూస్తాయి. ఇది జుట్టుకు మంచి షైనింగ్ ఇవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

అనాస పండు రసం

కివి పండులో విటమిన్ C తో పాటు విటమిన్ E కూడా ఉంటుంది. ఈ కాంబినేషన్ పొడిబారిన చర్మానికి అమృతంలా పనిచేసి, మృదుత్వాన్ని ఇస్తుంది.

కివి రసం

టమాటా, క్యారెట్ కలిపిన జ్యూస్ తాగడం వల్ల చర్మ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగై, జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది.

టమాటా, క్యారెట్ మిశ్రమం

స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్ C చర్మం వృద్ధాప్య ఛాయలకు లోనుకాకుండా చూస్తుంది. ఇది జుట్టు చిట్లిపోకుండా బలాన్ని చేకూరుస్తుంది.

స్ట్రాబెర్రీ రసం

తాజా జ్యూస్‌లను ఎలాంటి చక్కెర కలపకుండా ఉదయాన్నే తాగడం మంచిది. తీవ్రమైన సమస్యలుంటే మాత్రం ఒకసారి చర్మ నిపుణులను సంప్రదించండి.