కాయధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొందరికి వీటిని తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావచ్చు.
శనగలు, రాజ్మా, అలసందలు, బఠానీల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
కాయధాన్యాలను వండే ముందు 8–10 గంటలు నీటిలో నానబెట్టండి. దీంతో జీర్ణానికి ఇబ్బంది కలిగించే పదార్థాలు తగ్గుతాయి.
నానబెట్టిన నీటిని పారబోసి కొత్త నీటితో ఉడికిస్తే గ్యాస్, కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం తగ్గుతుంది.
వంటలో జీలకర్ర, ఇంగువ, అల్లం లేదా సోంపు కలిపితే జీర్ణక్రియ మెరుగై కడుపు హాయిగా ఉంటుంది.
ఒక్కసారిగా ఎక్కువగా తినకుండా చిన్న మోతాదుతో ప్రారంభించి క్రమంగా పరిమాణాన్ని పెంచడం మంచిది.
కాయధాన్యాలతో పాటు తగినంత నీరు తాగడం వల్ల ఫైబర్ సులభంగా జీర్ణమై అసౌకర్యం తగ్గుతుంది.
భోజనం చేసిన తర్వాత 10–15 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ చురుకుగా జరిగి ఉబ్బరం తగ్గేందుకు సహాయపడుతుంది.
తరచూ కడుపు ఉబ్బరం ఉంటే మొలకెత్తిన కాయధాన్యాలు లేదా బాగా ఉడికించిన వాటిని ఎంచుకోవడం మంచిది.
ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే కాయధాన్యాల పోషకాలు పొందడంతో పాటు కడుపు ఉబ్బరం సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.