23rd June 2026

__________

- Saidulu

జుట్టుకు సహజ పోషణ అందించే మునగాకు హెయిర్ మాస్క్..

జుట్టు ఆరోగ్యంగా, దట్టంగా ఉండాలంటే సరైన పోషణ చాలా అవసరం. ఈ క్రమంలో మునగాకు పొడితో తయారు చేసే హెయిర్ మాస్క్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.

మునగాకు పొడిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి.

ఒకటి లేదా రెండు స్పూన్ల మోరింగా పౌడర్‌కు పెరుగు లేదా అలొవెరా జెల్ కలిపి మృదువైన పేస్ట్‌లా తయారు చేసుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని తల చర్మంతో పాటు జుట్టు మొత్తం భాగానికి సమానంగా అప్లై చేయాలి. ముఖ్యంగా కుదుళ్ల వద్ద బాగా పట్టేలా చూసుకోవాలి.

సుమారు 30 నిమిషాల పాటు మాస్క్‌ను అలాగే ఉంచితే పోషకాలు తలకు బాగా చేరే అవకాశం ఉంటుంది.

తర్వాత గోరువెచ్చని నీటితో ,మైల్డ్ షాంపూ ఉపయోగించి జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీంతో జుట్టు తాజాగా అనిపిస్తుంది.

వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను ఉపయోగిస్తే జుట్టు పొడిబారడం తగ్గి మృదువుగా మారడానికి సహాయపడవచ్చు.

ఈ పాక్ తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

సహజ పదార్థాలతో తయారయ్యే ఈ హెయిర్ మాస్క్‌ను మీ హెయిర్ కేర్ రొటీన్‌లో చేర్చుకుంటే జుట్టు సంరక్షణ మరింత సులభంగా మారుతుంది.