ఉరుకుల పరుగుల జీవితంలో రోజువారీ పనుల వల్ల సాయంత్రానికి తీవ్రమైన అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!
ఎలాంటి వంట పని లేకుండా, కేవలం 5 నుండి 10 నిమిషాల్లో ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ సహాయంతో ఈ హెల్తీ ఎనర్జీ బైట్స్ చేయవచ్చు.
ఒక కప్పు గింజలు తీసిన ఖర్జూరాలు, అర కప్పు బాదం పప్పు, అర కప్పు జీడిపప్పు, పావు కప్పు వేరుశనగ పప్పు,రెండు స్పూన్ల నువ్వులు, చెంచా నెయ్యి, తాజా తేనె.
మొదటగా బాదం, జీడిపప్పు, వేరుశనగ పప్పులను ఒక పాన్‌లో వేసి దోరగా డ్రై రోస్ట్ (వేయించి) చేసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్ లో నువ్వులను కూడా వేయించి తీసి, చివరగా గింజలు లేని ఖర్జూరాలను మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
ఇప్పుడు వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, వేరుశనగలను మరీ పిండిలా కాకుండా కచ్చాపచ్చా ముక్కలుగా మిక్సీ పట్టుకోవాలి.
ఒక వెడల్పాటి బౌల్లో ఖర్జూరాల పేస్ట్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, నువ్వులు, నెయ్యి మరియు తేనె వేసి అంతా బాగా కలిసేలా కలపాలి.
ఈ పోషకాల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా (బైట్స్) చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఇన్స్టంట్ ఎనర్జీ బైట్స్ సిద్ధం!
వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే 20 రోజులు ఉంటాయి. రోజుకో లడ్డూ తింటే చాలు, అలసట మాయమై రోజంతా ఉల్లాసంగా ఉంటారు!