22nd June 2026

__________

- Saidulu

హోటల్ రుచిని తలపించే ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ... రుచికి ఫిదా కావాల్సిందే! 

ఇంట్లో కూరగాయలు లేకపోయినా, ముక్క లేనిదే ముద్ద దిగకపోయినా.. అందరికీ గుర్తొచ్చే ఏకైక క్విక్ అండ్ టేస్టీ ఛాయిస్ ఎగ్ బిర్యానీ! 

బాస్మతి బియ్యం, ఉడికించిన గుడ్లు, పెరుగు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా మరియు హోల్ బిర్యానీ మసాలాలు సిద్ధం చేసుకోండి. 

కావలసిన పదార్థాలు

ఎసరులో మసాలాలు, ఉప్పు వేసి మరిగాక, నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి 80-90% మాత్రమే ఉడికించి, నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.

అన్నం తయారీ

ఉడికించిన గుడ్లకు గాట్లు పెట్టి.. నూనెలో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి దోరగా వేయించి వేరే ప్లేట్‌లోకి తీసుకోండి.

గుడ్ల ఫ్రై

బిరిస్తా (ఫ్రైడ్ ఆనియన్స్) కోసం ఉల్లిపాయ ముక్కలను నూనెలో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి పెట్టుకోండి.

బిరిస్తా తయారీ

అదే నూనెలో షాజీరా, మసాలాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు వేసి పచ్చివాసన పోయేలా బాగా మగ్గనివ్వండి.

గ్రేవీ బేస్

మగ్గిన మిశ్రమంలో కారం, బిర్యానీ మసాలా, ఉప్పు మరియు కమ్మటి పెరుగు వేసి నూనె పైకి తేలే వరకు సిమ్ లో ఉడికించండి.

పెరుగు, మసాలాలు

గ్రేవీపై సగం ఫ్రైడ్ ఆనియన్స్, గుడ్లు ఉంచి, దానిపై ఉడికించిన అన్నం వేసి సమానంగా సర్దండి. పైన పుదీనా, కొత్తిమీర చల్లండి.

లేయరింగ్ 

చివరగా కొద్దిగా నెయ్యి, కుంకుమపువ్వు పాలు చల్లి, మూత పెట్టి కింద తవా ఉంచి 15 నిమిషాల పాటు సన్నని మంటపై దమ్ చేయండి.

దమ్ పెట్టడం