ఇంట్లో చిన్నపాటి గ్రీనరీ ఉంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అందుకోసం తప్పనిసరిగా మట్టి అవసరం లేదు. కొన్ని మొక్కలు కేవలం నీటిలోనే చక్కగా పెరుగుతాయి.
మనీ ప్లాంట్ నీటిలో పెంచడానికి అత్యంత ప్రజాదరణ పొందిన మొక్క. నీరు పోసిన గాజు సీసాలో ఉంచితే ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది.
లక్కీ బాంబూ కూడా నీటిలో సులభంగా పెరిగే మొక్క. తక్కువ సంరక్షణతోనే ఎక్కువకాలం పచ్చగా ఉంటుంది.
స్పైడర్ ప్లాంట్ గాలిని శుభ్రపరిచే లక్షణాలు కలిగి ఉంటుంది. నీటిలో పెంచినా ఆరోగ్యంగా పెరుగుతుంది.
పోతోస్ మొక్క ఎక్కడైనా వేగంగా పెరుగుతుంది. ఇంటి లోపల వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో పెట్టడానికి బెస్ట్ ఆప్షన్.
ఫిలోడెండ్రాన్ ఆకర్షణీయమైన ఆకులతో ఇంటి అలంకరణకు మంచి ఎంపికగా ఉంటుంది. దీన్ని కూడా నీటిలో పెంచవచ్చు.
ఈ మొక్కలను పెంచేటప్పుడు నీటిని వారానికి ఒకసారి మార్చడం మంచిది. దీంతో వేర్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ప్రత్యక్ష సూర్యకాంతి కాకుండా పరోక్ష వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచితే మొక్కలు మరింత అందంగా పెరుగుతాయి.
మట్టి లేకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ మొక్కలు మంచి ఎంపికగా నిలుస్తాయి.