బీరకాయ తొక్కలు పారేయకుండా వాటితో చేసే ఈ పచ్చడి రుచితో పాటు పోషకాలు కూడా అందిస్తుంది. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.
బీరకాయ తొక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, ఉప్పు, కొద్దిగా నూనె ఉంటే చాలు.
తొక్కలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి నూనెలో వేయిస్తే చేదు తగ్గి రుచి మరింత పెరుగుతుంది.
వెల్లుల్లి, పచ్చిమిర్చితో పాటు తొక్కలను వేయిస్తే పచ్చడికి మంచి రంగు, వాసన, టెక్స్చర్ వస్తాయి.
పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా కరకరలాడేలా గ్రైండ్ చేస్తే బీరకాయ తొక్క పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.
ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేస్తే పచ్చడి రుచి రెట్టింపు అవుతుంది.
వేడి అన్నం, నెయ్యి, ఇడ్లీ, దోసె లేదా రాగి సంగటితో ఈ పచ్చడి అద్భుతంగా సరిపోతుంది.