అందమైన నవ్వుకి ఆరోగ్యకరమైన దంతాలు ముఖ్యం. కానీ దంతాల ఆరోగ్యం మనం తినే కాల్షియం ఆహారాలపైనే ఆధారపడి ఉంటుంది.
పాలలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాల పైపొరను (ఎనామిల్) రక్షించి, పుచ్చుపళ్లను దూరం చేస్తాయి
పెరుగులో కాల్షియంతో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి నోటిలోని హానికర బ్యాక్టీరియాను నశింపజేసి చిగుళ్లను కాపాడతాయి.
జున్ను తింటే నోట్లో లాలాజలం పెరిగి యాసిడ్లు తగ్గుతాయి. ఇందులో ఉండే కేసిన్ ప్రోటీన్ దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది.
తోటకూర, బచ్చలికూరల్లో కాల్షియం, విటమిన్లు ఎక్కువ. ఇవి దంతాలను శుభ్రం చేయడమే కాక చిగుళ్ల వాపులను తగ్గిస్తాయి.
బాదంలో చక్కెరకు బదులు కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. రోజూ వీటిని నమలడం వల్ల దంతాలపై ప్లాక్ (చిక్కని పొర) ఏర్పడదు.
నువ్వులలో అత్యధికంగా కాల్షియం లభిస్తుంది. ఇవి దంత క్షయాన్ని అరికట్టి, దవడ ఎముకలను ఇనుములా బలంగా మారుస్తాయి.
తృణధాన్యాల్లో రాగులకు మించిన కాల్షియం లేదు. రాగి జావ లేదా రోటీలను డైట్‌లో చేర్చుకుంటే పళ్లు ఊడిపోకుండా ఉంటాయి.
కేవలం బ్రష్ చేయడమే కాదు, ఈ కాల్షియం ఆహారాలను భాగం చేసుకోండి. మీ డెంటిస్ట్‌ను సంప్రదించి ఆరోగ్యంగా నవ్వండి!