అమ్మచేతి వంటల్లో వంకాయ రుచే వేరు. వంకాయతో కమ్మని పెరుగు తోడైతే, ఆ రుచి ప్రతి ఒక్కరి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తేస్తుంది!
పెద్ద వంకాయ, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, నూనె, మరియు కొద్దిగా కొత్తిమీర.
పెద్ద వంకాయను తీసుకుని గుండ్రని ముక్కలుగా కోయాలి. ఆ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు మరియు కొద్దిగా నూనె వేసి బాగా పట్టించాలి.
మసాలా దట్టించిన వంకాయ ముక్కలను వేడి పెనంపై ఉంచి, రెండు వైపులా నూనె వేస్తూ ముక్కలు మెత్తబడే వరకు దోరగా కాల్చి తీయాలి.
ఒక గిన్నెలో గట్టి పెరుగును తీసుకుని గడ్డలు లేకుండా బాగా చిలకాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి.
నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఇంగువ వేసి బాగా వేయించాలి.
పెరుగు విరిగిపోకుండా ఉండాలంటే, సిద్ధం చేసిన పోపు చల్లారిన తర్వాతే పెరుగులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఆపై పెనం మీద కాల్చిన వంకాయ ముక్కలను కూడా అందులో వేసి, ముక్కలు అస్సలు నలిగిపోకుండా చాలా మెల్లగా కలుపుకోవాలి.
సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను పైన చల్లుకుంటే ఎంతో సువాసన భరితమైన, రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి సర్వింగ్‌కు రెడీ!
ఈ కమ్మని పెరుగు పచ్చడి వేడివేడి అన్నం, ముద్దపప్పు కాంబినేషన్‌లో లేదా చపాతీ, పులావ్‌లలోకి అమృతంలా ఉంటుంది. మీరు ట్రై చేయండి!