బయట చల్లగా ఉన్నప్పుడు, ప్లేట్‌లో పొగలు కక్కే వేడి క్యారెట్ హల్వా తింటుంటే వచ్చే ఆ మజాయే వేరు కదూ! అందరి ఫేవరెట్ స్వీట్ ఇది.
దీనికి 1 కేజీ ఎర్రటి క్యారెట్లు, అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలు, 1 కప్పు చక్కెర, అర కప్పు నెయ్యి, తగినంత డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు.
హల్వా జ్యూసీగా రావాలంటే మరీ ముదురువి కాకుండా, తాజా ఎర్రటి ఢిల్లీ క్యారెట్లను ఎంచుకుని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
కడాయిలో 2 చెంచాల నెయ్యి వేసి, క్యారెట్ తురుమును పచ్చివాసన పోయే వరకు మధ్యస్థ మంటపై 5-7 నిమిషాల పాటు బాగా వేయించాలి.
వేగిన క్యారెట్‌లో చిక్కటి పాలు పోసి కలపాలి. పాలు పూర్తిగా ఇగిరిపోయి, క్యారెట్ మెత్తగా ఉడికే వరకు మంటను అడ్జస్ట్ చేయాలి.
పాలు మొత్తం ఇగిరిపోయాక, 1 కప్పు చక్కెర వేయాలి. చక్కెర కరిగాక హల్వా మళ్లీ పల్చబడుతుంది, కాబట్టి దగ్గరకు పడేలా ఉడికించాలి.
మరొక చిన్న పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, కిస్‌మిస్‌లను దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
ఉడుకుతున్న హల్వాలో వేయించిన డ్రై ఫ్రూట్స్, మిగిలిన నెయ్యి, మంచి సువాసన కోసం అర చెంచా యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి.
నోరూరించే షాహీ క్యారెట్ హల్వా రెడీ! దీన్ని వేడిగా సర్వ్ చేయవచ్చు లేదా వనిల్లా ఐస్‌క్రీమ్‌తో కలిపి తింటే మరింత అద్భుతంగా ఉంటుంది.