18th June 2026

__________

- Saidulu

మొత్తం అన్నాన్నే ఆరగించేలా చేసే అసలైన దొండకాయ రోటి పచ్చడి..! ఆ తృప్తే వేరు

అమ్మచేతి ముద్ద గుర్తొస్తే గుర్తొచ్చేది రోటి పచ్చడే. వేడి అన్నంలో అమృతంలా కరిగిపోయే దొండకాయ పచ్చడి మనసుని తాకుతుంది!

పావు కేజీ తాజా దొండకాయలు, 8 పచ్చిమిర్చి, రెండు టమోటాలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, వేరుశనగ గుళ్ళు సిద్ధం చేసుకోండి.

కావలసిన పదార్థాలు

దొండకాయలను శుభ్రంగా కడిగి, చివర్లు కట్ చేసి సన్నని గుండ్రటి ముక్కలుగా తరిగి పెట్టుకుంటే ఇవి త్వరగా మగ్గుతాయి.

ముక్కల కోత

పాన్ లో ఆయిల్ వేసి దొండకాయలు, మిర్చి, టమోటా ముక్కలను పచ్చివాసన పోయేలా మీడియం ఫ్లేమ్ మీద దోరగా మగ్గించుకోవాలి.

దోరగా వేయించడం

ఈ పచ్చడికి అసలైన కమ్మదనం ఇచ్చేది వేయించిన పల్లీలే! ఇవి పచ్చడి టెక్స్చర్ ను పెంచి, తినేటప్పుడు అద్భుతమైన రుచిని ఇస్తాయి.

పల్లీల రుచి

రోట్లో లేదా మిక్సీలో పల్లీలు, వెల్లుల్లి, చింతపండుతో పాటు వేయించిన ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా దంచాలి.

రోటి నూరడం

నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ వేసి తాలింపు పెడితే పచ్చడికి అసలైన నోరూరించే సువాసన వస్తుంది.

గుమగుమలాడే తాలింపు

నోరూరించే ఆంధ్ర స్టైల్ దొండకాయ రోటి పచ్చడి రెడీ! వేడి అన్నం, ఇడ్లీ లేదా దోశల్లోకి ఇది అద్భుతంగా ఉంటుంది.

రుచి చూడండి

మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ ఇంట్లో ఈ టేస్టీ పచ్చడిని ట్రై చేసి, ఇంట్లో వాళ్లతో కలిసి కమ్మగా ఆరగించండి!