18th June 2026

__________

- Saidulu

బిర్యానీకే సరికొత్త ఫ్లేవర్‌ను అందించే ఉలవచారు బిర్యానీ..! తింటే మర్చిపోలేరు అస్సలు ...

 బిర్యానీ ప్రియులకు ఉలవచారు పేరు వింటేనే నోరు ఊరుతుంది. ఆంధ్రా స్పెషల్ రుచుల్లో ఈ కాంబినేషన్ ఎప్పటికీ సూపర్ హిట్టే!

ముందుగా ఉలవలను రాత్రంతా నానబెట్టాలి. కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి 7-8 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి.

ఉలవల ప్రిపరేషన్

ఉడికిన ఉలవల నుండి నీటిని వడకట్టి, అందులో కొద్దిగా చింతపండు రసం, ఉప్పు, కారం వేసి చిక్కగా మరిగించి చారు సిద్ధం చేయాలి.

చిక్కటి ఉలవచారు

బాస్మతి బియ్యాన్ని షాజీరా, ఇలాచీ, లవంగాలు వేసి 70 శాతం మాత్రమే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మెతుకు పొడిపొడిగా ఉండాలి.

బాస్మతి రైస్ ఉడికించడం

పాన్‌లో నెయ్యి వేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా మరియు మీకు నచ్చిన కూరగాయలు లేదా చికెన్ ముక్కలు వేసి వేపాలి.

మసాలా గ్రేవీ

వేగుతున్న మసాలా గ్రేవీలో మనం ముందే తయారుచేసుకున్న చిక్కటి ఉలవచారును పోసి, ముక్కలకు బాగా పట్టేలా ఉడికించాలి.

ఉలవచారు మ్యాజిక్ 

ఇప్పుడు గ్రేవీపై ఉడికించిన రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర లేయర్లుగా వేసి, పైన మరికొంత ఉలవచారు చల్లి మూత పెట్టాలి.

దమ్ ప్రాసెస్ 

పాత్రపై బరువు పెట్టి, చిన్న మంట మీద 15 నిమిషాల పాటు దమ్ చేయాలి. అప్పుడే ఉలవచారు ఫ్లేవర్ అన్నానికి బాగా పడుతుంది.

పర్‌ఫెక్ట్ టైమింగ్

దమ్ అయ్యాక వెంటనే కలపకుండా, 10 నిమిషాలు ఆగి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ లేదా వెన్న కలిపితే రెస్టారెంట్ స్టైల్ రుచి వస్తుంది.

ఎక్స్‌పర్ట్ ట్విస్ట్

ఘుమఘుమలాడే ఉలవచారు బిర్యానీ రెడీ! దీనిని ఉల్లిపాయ రైతాతో వేడివేడిగా సర్వ్ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

సర్వింగ్ టైం