15th June 2026

__________

- Saidulu

తగినంత మెగ్నీషియం సులభంగా లభించే పాలకూర బ్రెడ్ రోల్ రెసిపీ...

పాలకూరలో మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో చేసే బ్రెడ్ రోల్స్ రుచికరమైన స్నాక్.

ఈ రెసిపీ కోసం తాజా పాలకూర, బ్రెడ్ స్లైసులు, ఉడికించిన బంగాళాదుంప, మసాలా దినుసులు సిద్ధం చేసుకోండి.

ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి మెత్తగా తరిగి, కొద్దిసేపు వేయించి చల్లారనివ్వాలి.

ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప, పాలకూర, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా కలపాలి.

అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేసి రోల్స్ కోసం కావాల్సిన స్టఫింగ్‌ను సిద్ధం చేసుకోవాలి.

బ్రెడ్ అంచులను తీసి స్వల్పంగా నీరు చల్లి మెత్తగా చేసి, స్టఫింగ్‌ను మధ్యలో ఉంచాలి.

బ్రెడ్‌ను జాగ్రత్తగా చుట్టి రోల్ ఆకారంలోకి తీసుకురావాలి. అంచులు బాగా మూసివేయాలి.

రోల్స్‌ను స్వల్ప నూనెలో వేయించవచ్చు లేదా ఎయిర్ ఫ్రై చేయవచ్చు. బంగారు రంగు వచ్చే వరకు ఉడికించాలి.

బయట కరకరలాడుతూ, లోపల పాలకూర స్టఫింగ్‌తో ఈ రోల్స్ పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతాయి.

టమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేస్తే పాలకూర బ్రెడ్ రోల్స్ మరింత రుచిగా ఉంటాయి.