11th June 2026

__________

- Saidulu

చెత్తబుట్టల దుర్వాసన తగ్గించే వంటగది చిట్కాలు

వంటగదిలో చెత్తబుట్ట నుంచి వచ్చే దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యకు గుడ్‌బై చెప్పొచ్చు.

ఆహార వ్యర్థాలు, తడి చెత్త, బ్యాక్టీరియా పెరుగుదల వల్ల చెత్తబుట్టలో దుర్వాసన ఏర్పడుతుంది. క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం.

దుర్వాసనకు కారణం

చెత్తబుట్ట అడుగున కొద్దిగా బేకింగ్ సోడా చల్లితే దుర్వాసనను పీల్చుకుని తాజా వాతావరణాన్ని ఉంచడంలో సహాయపడుతుంది.

బేకింగ్ సోడా

లీక్‌ప్రూఫ్ చెత్త సంచులు వాడితే తడి బయటకు రాకుండా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, దుర్వాసన సమస్య తగ్గుతుంది.

చెత్త సంచులు

ముఖ్యంగా వేసవిలో చెత్తను ఎక్కువసేపు ఉంచకండి. రోజూ ఖాళీ చేస్తే దుర్వాసన, క్రిముల సమస్యలు తగ్గుతాయి.

రోజూ ఖాళీ చేయండి

వారానికి ఒకసారి వెనిగర్ నీటితో చెత్తబుట్టను కడిగితే బ్యాక్టీరియా తగ్గి దుర్వాసన రాకుండా ఉంటుంది.

వెనిగర్ క్లీనింగ్

తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచడం వల్ల చెత్త త్వరగా కుళ్లకుండా ఉంటుంది. దుర్వాసన కూడా తగ్గుతుంది.

 తడి చెత్త జాగ్రత్త

యాక్టివేటెడ్ చార్కోల్ ప్యాకెట్లు చెత్తబుట్ట దగ్గర ఉంచితే దుర్వాసనను సమర్థంగా పీల్చుకుని గాలిని తాజాగా ఉంచుతాయి. 

యాక్టివేటెడ్ చార్కోల్