పుదీనా సువాసన, మసాలాల రుచితో చేసే పుదీనా రైస్ ప్రతి ముద్దలో ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను అందిస్తుంది.
తాజా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పచ్చిమిర్చి, అల్లంతో కలిసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించి మంచి సువాసన వచ్చేలా చేయాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. దీంతో రైస్‌కు మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇదే రెసిపీకి ప్రధాన రహస్యం.
ఉప్పు, గరం మసాలా కలిపి బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించిన అన్నాన్ని జోడించాలి.
అన్నం మసాలాతో బాగా కలిసేలా మెల్లగా కలపాలి. ప్రతి గింజకు పుదీనా రుచి చేరేలా చూడాలి.
కొద్దిగా నిమ్మరసం, వేయించిన జీడిపప్పు జల్లితే పుదీనా రైస్ రుచి మరింత పెరుగుతుంది.
రాయితా లేదా వెజ్ కర్రీతో ఈ ఘుమఘుమలాడే పుదీనా రైస్‌ను సర్వ్ చేస్తే అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు.