9th June 2026

__________

- Saidulu

బెడ్‌రూమ్ గాలి విషపూరితమైతే కనిపించే సాధారణ లక్షణాలు..

రాత్రి ఎంతసేపు పడుకున్నా పొద్దున లేవగానే ఇంకా అలసటగా, నీరసంగా అనిపిస్తోందా? దీనికి మీ బెడ్‌రూమ్ గాలే కారణం కావచ్చు, జాగ్రత్త!

కిటికీలు మూసేయడం వల్ల CO2 పెరిగి, మెదడుకు ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పి వేధిస్తుంది.

 నిరంతర తలనొప్పి

గదిలోని పెయింట్స్, ఫర్నిచర్ వదిలే VOC వాయువులు శ్వాస ద్వారా లోపలికి వెళ్ళి గొంతులో మంట మరియు పొడిబారడం కలిగిస్తాయి.

గొంతులో మంట, పొడిబారడం 

బెడ్‌షీట్స్, కార్పెట్లలో చేరే ఫార్మాల్డిహైడ్ గ్యాస్ టాక్సిన్స్‌గా మారి, గదిలోకి రాగానే కళ్లు ఎర్రబడటం, నీళ్లు రావడానికి కారణమవుతుంది.

కళ్లలో దురద, నీళ్లు తిరగడం

ఎసి లేదా గది మూలల్లో చేరే మైక్రోస్కోపిక్ బూజు (Mold) కణాలు గాలిలో కలవడం వల్ల నిరంతరాయంగా దగ్గు, తుమ్ములు వస్తుంటాయి.

తగ్గని దగ్గు, తుమ్ములు

పరుపులు, దుప్పట్లలో వేగంగా పెరిగే డస్ట్ మైట్స్ (ధూళి కణాలు) గాలిలో కలిసి చర్మంపై విపరీతమైన దురద, అలర్జీలను కలిగిస్తాయి.

చర్మంపై అలర్జీలు 

గదిలో తాజా గాలి లోపించడం వల్ల వాయు నాణ్యత తగ్గి ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. అస్తమా ఉన్నవారికి ఇది మరింత ఇబ్బంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 

గాలిలోని అలర్జెన్స్ ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ముక్కు లోపలి పొరలు వాచి, రాత్రి వేళ శ్వాస ఆడకుండా ముక్కు బాగా దిబ్బడ వేస్తుంది.

ముక్కు దిబ్బడ

తేమ ఎక్కువగా ఉండటం, గోడలపై నల్ల మచ్చలు, బూజు వాసన లేదా గాలి బరువుగా అనిపించడం ఇండోర్ ఎయిర్ క్వాలిటీ సమస్యలకు సూచనలు.

గదిలో సంకేతాలు గమనించండి

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బెడ్‌రూమ్ కిటికీలు తెరవండి. ఇండోర్ ప్లాంట్స్ పెంచడం లేదా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ వాడటం చాలా ముఖ్యం.

పరిష్కారం