8th June 2026

__________

- Saidulu

హెన్నాలో ఇవి కలిపితే.. జుట్టు సహజంగా నల్లగా మెరిసిపోతుంది!

జుట్టుకు సహజంగా నలుపుదనం ఇవ్వాలనుకునే వారు ఎక్కువగా గోరింటాకు ఉపయోగిస్తుంటారు. అయితే గోరింటాకులో కొన్ని సహజ పదార్థాలు కలిపితే రంగు మరింత ముదురుగా వచ్చే అవకాశం ఉంటుంది.

గోరింటాకు పొడిలో టీ డికాక్షన్ కలిపితే రంగు మరింత గాఢంగా పడుతుంది. ఇది జుట్టుకు సహజమైన మెరుపును కూడా ఇస్తుంది.

కాఫీ పొడిని కొద్దిగా కలిపి పేస్ట్ తయారు చేస్తే నలుపు-గోధుమ రంగు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తెల్ల జుట్టును కవర్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఉసిరి పొడి కలపడం వల్ల జుట్టు బలపడటమే కాకుండా రంగు ఎక్కువ రోజులు నిలుస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది మంచిది.

కరివేపాకు పొడిని జోడిస్తే సహజమైన నలుపుదనం పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

గోరింటాకు మిశ్రమంలో నిమ్మరసం కొద్దిగా కలిపితే రంగు బాగా పడుతుంది. అయితే ఎక్కువగా వేయకూడదు, లేదంటే జుట్టు పొడిబారే అవకాశం ఉంటుంది.

రాత్రంతా గోరింటాకు పేస్ట్‌ను ఇనుప గిన్నెలో నానబెట్టి ఉదయం అప్లై చేస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. రంగు జుట్టుకు బాగా పట్టేందుకు ఇది సహాయపడుతుంది.

సహజమైన నలుపు రంగు కోసం గోరింటాకుతో గడ్డి చామంతి ఆకుల పేస్ట్ సరైన మోతాదులో ఉపయోగిస్తే జుట్టు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

అప్లై చేసిన తర్వాత కనీసం రెండు నుంచి మూడు గంటలు ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుంది. వెంటనే షాంపూ చేయకుండా కేవలం నీటితో కడగడం మంచిది.