5th June 2026

__________

- Saidulu

మామిడి తొక్కలు చెత్త కాదు.. ఇంట్లోనే ఇలా ఉపయోగించుకోవచ్చు..

మామిడి పండ్లు తిన్న తర్వాత చాలా మంది తొక్కలను చెత్తలో పడేస్తుంటారు. అయితే మామిడి తొక్కలు మంచి సహజ వనరుగా మారుతాయి.

మామిడి తొక్కలను ఎండబెట్టి పొడిగా తయారు చేసి ఫేస్‌ప్యాక్‌లో కలపవచ్చు. ఇది చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో సహాయపడుతుంది.

తొక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కలకు పోస్తే పోషకాలు అందుతాయి. దీంతో మొక్కల పెరుగుదలకు మేలు జరుగుతుంది.

మామిడి తొక్కలను కంపోస్ట్ గుంతలో వేయవచ్చు. ఇవి త్వరగా కుళ్లి మంచి సేంద్రియ ఎరువుగా మారుతాయి.

ఎండిన తొక్కలను పొడి చేసి పెరుగు లేదా తేనెలో కలిపి స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

తోటలో ఉన్న మొక్కల చుట్టూ మామిడి తొక్కలను చిన్న ముక్కలుగా చేసి వేయడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. దీంతో నేల నాణ్యత మెరుగుపడుతుంది.

మామిడి తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, కొన్ని విటమిన్లు కూడా ఉంటాయి. అందువల్ల వీటిని పూర్తిగా వ్యర్థంగా భావించకుండా ఉపయోగించుకోవచ్చు.

అయితే తొక్కలను ఉపయోగించే ముందు బాగా కడగడం అవసరం. పండ్లపై ఉండే దుమ్ము లేదా రసాయన అవశేషాలు తొలగిన తర్వాతే వాటిని వినియోగించడం మంచిది.