3rd June 2026

__________

- Saidulu

మైసూర్ పాక్ గుల్లగా, మెత్తగా రావాలంటే ఇలా చేయండి! 

పండగైనా, పెళ్లయినా ముక్క నోట్లో పడితే ఆ మజానే వేరు! ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం.

శనగపిండి: 1 కప్పు, చక్కెర: 2 కప్పులు నెయ్యి: 2 కప్పులు (సగం నెయ్యి, సగం ఆయిల్ అయినా వాడుకోవచ్చు) నీళ్లు: అర కప్పు

ఇవి రెడీ చేసి పెట్టుకోండి!

శనగపిండిని బాగా జల్లించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా వేడి నెయ్యి వేసి ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలుపుకోండి.

ఉండలు లేకుండా.. 

ఒక మందపాటి గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి వేడి చేయండి. చక్కెర కరిగి ఒంటి తీగ పాకం  వచ్చే వరకు మరిగించండి.

తీగ పాకం ముఖ్యం!

పాకం వచ్చాక, మంటను సిమ్‌లో ఉంచి, ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి.

మంట తగ్గించి..

మరో పక్కన నెయ్యిని వేడిగా ఉంచండి. పిండి ఉడుకుతున్నప్పుడు, వేడి వేడి నెయ్యిని ఒకట్రెండు స్పూన్లు పోస్తూ కలుపుతూ ఉండాలి. పిండి నెయ్యినంతా పీల్చేసుకుంటుంది.

నెయ్యి పోస్తూ కలపండి 

పిండి దగ్గర పడి, నెయ్యిని బయటకు వదులుతూ, జల్లెడలా (గుల్లగా) మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

గిన్నెకు అంటుకోకుండా..

ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లేదా ట్రేలోకి ఈ మిశ్రమాన్ని వెంటనే వంపేయండి. గట్టిగా నొక్కకూడదు, లైట్‌గా సర్దాలి.

సెట్ చేయడం 

మిశ్రమం కొద్దిగా చల్లారకముందే చాకుతో మీకు నచ్చిన షేప్‌లో గాట్లు పెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలను వేరు చేయండి.

వేడిగా ఉన్నప్పుడే.. 

అంతే! ఎంతో రుచికరమైన, టేస్టీ మైసూర్ పాక్ సిద్ధం. నోట్లో వేసుకుంటే అమృతంలా కరిగిపోతుంది!

స్వీట్ ఎంజాయ్ చేయండి!