2nd Jun 2026

___________

- Saidulu

కరివేపాకు ఫ్రెష్‌గా ఉండే సీక్రెట్..

కరివేపాకు వంటలకు మంచి రుచి, సువాసనను అందిస్తుంది. అయితే సరైన విధంగా నిల్వ చేయకపోతే త్వరగా నల్లబడిపోవడం లేదా ఎండిపోవడం జరుగుతుంది.

ముందుగా కరివేపాకును కడిగిన తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి. తేమ ఉంటే ఆకులు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

ఆకులను కొమ్మల నుంచి వేరు చేసి నిల్వ చేస్తే ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. అలాగే ఎక్కువకాలం తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఇది అదనపు తేమను పీల్చుకుంటుంది.అలాగే ఆకు బూజు పట్టకుండా ఉంటుంది.

ఈ విధంగా నిల్వ చేస్తే ఆకులు చాలా రోజుల పాటు పచ్చగా ఉండే అవకాశం ఉంటుంది. తరచూ బయటకు తీసి పెట్టడం మాత్రం తగ్గించాలి.

ఎక్కువ పరిమాణంలో ఉంటే చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి నిల్వ చేయడం మంచిది. అవసరమైనంత మాత్రమే బయటకు తీసుకోవచ్చు.

కొంతమంది కరివేపాకును ఎండబెట్టి పొడిగా కూడా నిల్వ చేస్తారు. ఇది ఎక్కువకాలం ఉపయోగించుకోవడానికి మంచి మార్గం.

సరైన స్టోరేజ్ పద్ధతిని పాటిస్తే కరివేపాకు రుచి, సువాసన ఎక్కువ రోజులు అలాగే ఉంటాయి. దీంతో వంటల్లో ఎప్పుడైనా తాజా కరివేపాకును ఉపయోగించుకోవచ్చు.