1st June 2026

___________

- Saidulu

చర్మ సంరక్షణలో నిమ్మకాయ మ్యాజిక్..

నిమ్మకాయ వంటలో మాత్రమే కాదు, చర్మ సంరక్షణలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇందులోని సహజ గుణాలు చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.

నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మానికి సహజమైన కాంతిని అందించడంలో ఉపయోగపడుతుంది.

నిమ్మరసం ముఖంపై పేరుకుపోయే అదనపు జిడ్డును తగ్గించి కాంతిని పెంచుతుంది. నిమ్మరసం రెగ్యులర్గా ఫేస్ ఫ్యాక్స్ లో వాడడం వల్ల స్కిన్ క్లియర్ గా మారుతుంది.

నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాయడం కంటే ఇతర సహజ పదార్థాలతో కలిపి ఉపయోగించడం మంచిది. ఇది చర్మానికి సున్నితంగా పనిచేస్తుంది.

తేనెతో కలిపిన నిమ్మరసం ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారేందుకు సహాయపడుతుంది. చాలా మంది ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు.

పెరుగు, నిమ్మరసం కలయిక కూడా మంచి ఫేస్ ప్యాక్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చేతి భాగంలో పరీక్షించుకోవడం మంచిది. ప్రతి చర్మం ఒకే విధంగా స్పందించదు.

నిమ్మరసం ఉపయోగించిన వెంటనే ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. సూర్యరశ్మి వల్ల కొందరిలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సరైన విధంగా ఉపయోగిస్తే నిమ్మకాయ చర్మ సంరక్షణలో మంచి సహాయకారిగా మారుతుంది. సహజమైన అందాన్ని కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడే పదార్థాల్లో ఒకటి.