1st June 2026

__________

- Saidulu

హెయిర్ ఫాల్ తగ్గించే.. జామ ఆకు బెనిఫిట్స్

జుట్టు రాలడం ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్య. కొన్ని సహజమైన ఇంటి చిట్కాలు జుట్టు సంరక్షణలో సహాయపడతాయి. వాటిలో జామ ఆకులు కూడా ఒకటి.

జామ ఆకుల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తల చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

కొన్ని జామ ఆకులను నీటిలో మరిగించి చల్లారనివ్వాలి. ఆ నీటిని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి.

ఈ నీటితో తలకు మసాజ్ చేయడం వల్ల తల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జామ ఆకులలో ఉండే పోషకాలు జుట్టు మూలాలను బలపరచడంలో సహాయపడతాయని చెబుతారు. దీంతో జుట్టు చిట్లడం ,విరగడం తగ్గుతుంది.

తలలో అధిక జిడ్డు, మురికి తొలగించడంలో కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. స్కాల్ప్ తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ పద్ధతిని పాటించవచ్చు. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది.

అయితే హెయిర్ ఫాల్‌కు కారణాలు వ్యక్తిగతంగా మారవచ్చు. సరైన ఆహారం, నిద్ర, జీవనశైలి కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.