చపాతీ, పులావ్, బిర్యానీల్లోకి అదిరిపోయే గ్రేవీ కూర. చిన్న బంగాళాదుంపలతో చేసే స్పెషల్ వంటకం.
బేబీ పొటాటోస్ అరకేజీ, ఉల్లిపాయలు 2, టమాటాలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మరియు జీడిపప్పు పేస్ట్.
నూనె, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క.
బంగాళాదుంపలను 2 విజిల్స్ వచ్చేలా ఉడికించి, తొక్క తీసి, మసాలా లోపలికి వెళ్లేలా ఫోర్క్‌తో చిన్న రంధ్రాలు చేయాలి.
కడాయిలో 3 స్పూన్ల నూనె వేసి, ఉడికించిన బంగాళాదుంపలను దోరగా, ఎర్రగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
నూనెలో హోల్ గరం మసాలా వేసి, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.
టమాటా పేస్ట్ వేసి నూనె తేలే వరకు ఉడికించాలి. తర్వాత పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి.
మంట తగ్గించి పెరుగు, జీడిపప్పు పేస్ట్ వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇది గ్రేవీకి మంచి చిక్కదనాన్ని ఇస్తుంది.
నీళ్లు పోసి, గ్రేవీ మరిగాక ఆలూ వేసి, మూత పెట్టి 10 నిమిషాలు చిన్న మంటపై దమ్ చేయాలి. చివర్లో కొత్తిమీర చల్లాలి.
వేడివేడి దమ్ ఆలూను జీరా రైస్, బటర్ నాన్ లేదా చపాతీతో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తింటే అదిరిపోయే రుచి వస్తుంది.