29th May 2026

__________

- Saidulu

అధిక ప్రోటీన్‌తో రుచికరమైన మిల్ మేకర్ ఫ్రై.. చేసుకోండి ఇలా !

మిల్ మేకర్‌తో తయారయ్యే వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా అధిక పోషక విలువలతో కూడినవిగా ఉంటాయి.

ముందుగా మిల్ మేకర్‌ను వేడి నీటిలో సుమారు 10 నిమిషాలు నానబెట్టి మృదువుగా చేయాలి. తరువాత అదనపు నీటిని పూర్తిగా పిండి తీసి వంటకు సిద్ధం చేయాలి.

పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేయాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి సువాసన వచ్చే వరకు వేపాలి. తరువాత టమోటాలు వేసి మృదువుగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి , ఉప్పు వేసి మసాలాను సమంగా కలపాలి.మసాలా నుంచి నూనె వేరుగా కనిపించే స్థాయికి వచ్చే వరకు వండితే మంచి రుచి వస్తుంది.

తయారైన మసాలాలో నానబెట్టిన మిల్ మేకర్‌ను కలిపి మసాలా బాగా పట్టేలా చేయాలి. అవసరమైతే కొద్దిగా నీరు జోడించి మూతపెట్టి 5–7 నిమిషాలు ఉడికించాలి.

కాస్త క్రీమీగా కావాలి అనుకుంటే నానబెట్టిన జీడిపప్పుల పేస్ట్ ఇందులో కలిపితే సరిపోతుంది. టేస్ట్ కోసం పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేయవచ్చు.

ఈ విధంగా తయారైన మిల్ మేకర్ ఫ్రై అన్నం, చపాతీ లేదా రోటీతో సర్వ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.