శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి, బరువు తగ్గించే హెల్తీ అవిసె గింజల లడ్డులను ఇలా ఈజీగా చేసుకోండి.
అవిసె గింజలు 1 కప్పు, నువ్వులు, పల్లీలు అర కప్పు చొప్పున, తురిమిన బెల్లం 1.5 కప్పు, నెయ్యి, యాలకులు, డ్రై ఫ్రూట్స్.
కావల్సినవి
పాన్‌లో నూనె లేకుండా అవిసె గింజలు, నువ్వులు, పల్లీలను విడివిడిగా లో-ఫ్లేమ్‌పై దోరగా వేయించి చల్లార్చాలి.
వేయించడం
వేయించిన గింజలన్నీ పూర్తిగా చల్లారాక, మిక్సీ జార్‌లోకి తీసుకుని కాస్త బరకగా పొడి చేసుకోవాలి.
పొడి చేయడం
అదే జార్‌లో తురిమిన బెల్లం, యాలకుల పొడి వేసి, అంతా బాగా కలిసేలా మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
బెల్లం కలపడం
ఈ పొడిలో.. నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం ముక్కలను ఆ నేతితో సహా పోసి బాగా మిక్స్ చేయాలి.
నెయ్యి, డ్రై ఫ్రూట్స్
మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి.
లడ్డూలు చుట్టడం
ఇందులో ఉండే ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వును వేగంగా కరిగిస్తాయి. రోజుకు ఒకటి తింటే బరువు సులువుగా తగ్గుతారు.
వెయిట్ లాస్ బెనిఫిట్స్