18th May 2026

____________

- Saidulu

మటన్‌కంటే ఎక్కువ బలం ఇచ్చే ఎండు రొయ్యలు..

ఎండు రొయ్యలు తీరప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆహారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఈ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

చాలామంది బలం కోసం మటన్, చికెన్ తింటారు. కానీ ఎండు రొయ్యల్లో కూడా అధికంగా ప్రోటీన్లు లభిస్తాయి.

పిల్లల ఎదుగుదలకు, కండరాలు బలపడేందుకు ఇవి బాగా సహాయపడతాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

ఎండు రొయ్యలను ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి బరువు నియంత్రణలో సహాయపడతాయి.

కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు ఎముకలు, రక్తానికి మేలు చేస్తాయి. థైరాయిడ్ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

విటమిన్ బి12, విటమిన్ ఇ ఉండటం వల్ల చర్మం మెరిసిపోతుంది. జుట్టు రాలకుండా బలంగా ఉండేందుకు కూడా తోడ్పడుతుంది.

క్రమం తప్పకుండా ఎండు రొయ్యలు తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యలు తగ్గుతాయి.

రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎండు రొయ్యలను వారానికి ఒక్కసారైనా ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి మంచి పోషణ లభిస్తుంది.