ఇంట్లో పెంచుకునే మొక్కలు పచ్చగా, అందంగా కనిపిస్తే ఇంటికే ప్రత్యేకమైన అందం వస్తుంది. అయితే వాటిని ఆరోగ్యంగా ఉంచాలంటే మట్టిలో సరైన పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కుండీల్లో ఉన్న మట్టి కొంతకాలానికి తన సారాన్ని కోల్పోతుంది. నీరు పోయడం, మొక్కలు పోషకాలను తీసుకోవడం వల్ల మట్టి బలహీనపడుతుంది.
మొక్కలకు కేవలం ఎండ, నీరు సరిపోవు. వాటి వేర్లు బలంగా పెరగాలంటే మట్టిలో పోషకాలు సమృద్ధిగా ఉండాలి.
రసాయనిక ఎరువుల కంటే సహజమైన పద్ధతులు మొక్కలకు ఎక్కువ మేలు చేస్తాయి. ఇంట్లో దొరికే వ్యర్థాలతోనే మంచి ఎరువు తయారు చేయవచ్చు.
కూరగాయల తొక్కలు, పండ్లు..ఇలా వంటింటి వ్యర్ధాలతో చేసిన సేంద్రియ ఎరువులు మట్టికి మంచి బలం ఇస్తాయి. ఇవి మొక్కలకు అవసరమైన పోషకాలను సహజంగా అందిస్తాయి.
మొక్కలకు ఎక్కువ నీరు పోయడం కూడా ప్రమాదమే. అవసరానికి మించి నీరు పెడితే వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.
సరైన సంరక్షణతో మొక్కలు చీడపీడలకు దూరంగా ఉంటాయి. పచ్చగా పెరిగిన మొక్కలు ఇంటి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.
ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంటి గార్డెన్ ఏడాది పొడవునా కళకళలాడుతుంది. ఆరోగ్యంగా పెరిగిన మొక్కలు ఇంటికి సహజమైన అందాన్ని తీసుకొస్తాయి.