16th May 2026

____________

- Saidulu

మనుషుల అసలు స్వభావాన్ని బయటపెట్టే అలవాట్లు

మనుషులు పైకి ఎలా ఉన్నా, వారి చిన్న చిన్న అలవాట్లు వారి అసలు స్వభావాన్ని చెప్పేస్తాయి. అవేంటో చూద్దాం.

మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో మీరు ప్రవర్తించే తీరు మీ సంస్కారాన్ని, మీ అసలు క్యారెక్టర్‌ను చూపిస్తుంది.

వెయిటర్లతో ప్రవర్తన

అవసరానికి ఒక మాట, తీరా పని అయ్యాక మరో మాట చెప్పేవారిని అస్సలు నమ్మలేం. వీరిది స్వార్థపూరిత స్వభావం.

మాట నిలకడ

మిత్రులు లేదా బంధువులు విజయం సాధించినప్పుడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారా లేదా కుళ్లుకుంటున్నారా? ఇదే అసలు గుణం.

ఇతరుల విజయం

చేసిన తప్పును కప్పిపుచ్చుకోకుండా, నిజాయితీగా క్షమాపణ అడిగే వ్యక్తికి అహంకారం తక్కువ, బాధ్యత ఎక్కువ.

తప్పు ఒప్పుకోవడం

సమస్యల్లో ఉన్నప్పుడు మనిషి తన అసహనాన్ని ఎలా ప్రదర్శిస్తారో గమనించండి. అది వారి మానసిక ధృడత్వాన్ని చెబుతుంది.

కష్టాల్లో ఉన్నప్పుడు

ఒకరు నమ్మి చెప్పిన విషయాన్ని ఇతరులకు చెప్పే అలవాటు ఉంటే, వారు నమ్మకానికి ఏమాత్రం అర్హులు కారు.

 రహస్యాలు దాచడం

మాట్లాడేటప్పుడు కళ్లల్లోకి చూసి మాట్లాడుతున్నారా లేదా తడబడుతున్నారా? ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, నిజాయితీని తెలుపుతుంది.

బాడీ లాంగ్వేజ్

మనుషులను అంచనా వేయడానికి మాటల కంటే వారి ప్రవర్తనే ముఖ్యం. నిశితంగా గమనిస్తే ఎవరెంటో అర్థమైపోతుంది!