చిన్నపిల్లలు ఒక్కసారిగా ఎక్కువగా ఏడవడం దిష్టి తగిలిందనే సంకేతంగా భావిస్తారు. తినకపోవడం, నిద్రపోకపోవడం వంటి మార్పులు కనిపిస్తే పెద్దలు దిష్టి తీసే ప్రయత్నం చేస్తారు.
ఇంట్లో తరచూ వస్తువులు పగలడం లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం కూడా చెడు చూపు ప్రభావంగా నమ్ముతారు. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో అకస్మాత్తుగా ఉద్రిక్తతలు పెరగవచ్చు.
వ్యాపారం బాగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా నష్టాలు రావడం కూడా చాలామంది దిష్టితో అనుసంధానిస్తారు. కస్టమర్లు తగ్గడం, పనులు ఆగిపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా అలసట, తలనొప్పి లేదా నిరుత్సాహం రావడం కూడా దిష్టి లక్షణంగా చెబుతారు. వైద్య పరీక్షల్లో సమస్యలు కనిపించకపోయినా ఇబ్బందులు కొనసాగవచ్చు.
ఇంట్లో మొక్కలు త్వరగా ఎండిపోవడం లేదా పెంపుడు జంతువులు అసహజంగా ప్రవర్తించడం కూడా కొందరు నెగెటివ్ ఎనర్జీ సంకేతంగా భావిస్తారు.
అందంగా అలంకరించిన ఇల్లు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత సమస్యలు మొదలైతే చాలామంది దిష్టి పడిందని అంటారు. అందుకే నిమ్మకాయలు, పచ్చిమిర్చి వంటి వాటిని ఉపయోగిస్తారు.
దిష్టి ప్రభావం ఉందని భావించినప్పుడు చాలామంది ఉప్పు, ఎండుమిర్చితో దిష్టి తీస్తారు. కొందరు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.
శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా లేకపోయినా ఈ నమ్మకాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మానసిక ధైర్యం ,సానుకూల ఆలోచనలు ఉంటే చెడు ప్రభావాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.