మన సంస్కృతిలో నర దిష్టి అంటే చెడు చూపు ప్రభావం అని నమ్ముతారు. కుటుంబంలో సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు లేదా అకస్మాత్తుగా కలిగే ఆటంకాలకు దిష్టి కారణమని చాలామంది భావిస్తారు.
ఇంటి ముందు నిమ్మకాయలు, పచ్చిమిర్చి కట్టడం చాలా సాధారణమైన దిష్టి నివారణ పద్ధతి. ఇది నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని పెద్దలు చెబుతారు.
చిన్నపిల్లలకు నల్లటి బొట్టు పెట్టడం కూడా పాతకాలం నుంచి వస్తున్న ఆచారం. ఇలా చేయడం వల్ల పిల్లలపై పడే చెడు చూపు తగ్గుతుందని విశ్వాసం.
బూడిద గుమ్మడికాయను ఇంటి గుమ్మం వద్ద వేలాడదీయడం కూడా దిష్టి నివారణలో భాగమే. ఇది ఇంటిపై ఉన్న నెగెటివ్ ప్రభావాలను గ్రహిస్తుందని నమ్ముతారు.
ఉప్పు ,ఎండుమిర్చితో దిష్టి తీయడం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపించే పద్ధతి. వాటిని తల చుట్టూ తిప్పి అగ్నిలో వేయడం ద్వారా చెడు శక్తులు తొలగిపోతాయని భావిస్తారు.
సాయంత్రం వేళల్లో ఇంటి ముందు దీపం వెలిగించడం కూడా పోస్టివిటీ కి ప్రతీక అంటారు. దీప కాంతి వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని విశ్వాసం.
ఇంటి పరిశుభ్రత కూడా దిష్టి నివారణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చెత్త, అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశాల్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతారు.
దైవ నామస్మరణ, పూజలు, యాగాలు చేయడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. సానుకూల ఆలోచనలు చెడు ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి.
శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా లేకపోయినా ఈ ఆచారాలు చాలామందికి మానసిక ప్రశాంతతను ఇస్తున్నాయి. అందుకే నర దిష్టి నివారణ పద్ధతులు ఇప్పటికీ మన సంప్రదాయంలో కొనసాగుతున్నాయి.