వేసవి కాలంలో శరీరానికి చల్లదనం అవసరమైనట్లే రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ సీజన్లో చాలా ఎక్కువ షుగర్ ఉన్న కూల్ డ్రింక్స్ తాగుతారు.
ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగినప్పటికీ తెలియకుండా ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుంది.
అందుకే సరైన సహజ పానీయాలను తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మజ్జిగ షుగర్ ఉన్నవారికి మంచి సమ్మర్ డ్రింక్‌గా భావిస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి శరీరానికి తేలికైన శక్తిని అందిస్తుంది.
నిమ్మరసం చక్కెర లేకుండా తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయం తీసుకుంటే శరీరంలోని అధిక వేడిని తగ్గించడంతోపాటు మీ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.
కీరదోసకాయ జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల ఇది బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది.
కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్స్తో నిండి ఉంటుంది. ఇది శరీరానికి తేమను అందించి అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.
పుదీనా, తులసితో తయారుచేసిన హర్బల్ డ్రింక్స్ వేసవిలో శరీరానికి ప్రశాంతతను ఇస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి శక్తిని పెంచుతాయి.
చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్‌కు బదులుగా సహజ పానీయాలను ఎంచుకోవడం మంచిది. సరైన ఆహారం, వ్యాయామంతో పాటు ఈ డ్రింక్స్ తీసుకుంటే షుగర్ నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది.