మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. అయితే మన డైట్ లో చేసే తేలికపాటి చేంజెస్ వల్ల దీన్ని నివారించవచ్చు.
మనలో చాలామంది కూరగాయలను తక్కువగా తీసుకుంటారు. కానీ కొన్ని రకాల కూరగాయలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా కంట్రోల్ లో ఉంటాయి.
బెండకాయలో ఉండే ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తనాళాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ , ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేందుకు సహాయపడతాయి. రోజూ క్యారెట్ తింటే హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బ్రోకోలీ ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా భావిస్తారు. ఇందులో ఉండే పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుని గుండెను రక్షిస్తాయి.
పాలకూరలో ఐరన్‌తో పాటు ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్ రక్తాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే సహజ నైట్రేట్లు రక్తపోటును నియంత్రించి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
రోజూ వ్యాయామం, సరైన నిద్రతో పాటు ఈ వెజిటేబుల్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహజమైన జీవనశైలి ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.