11th May 2026

___________

- Saidulu

ఎండిన పూలతో అద్భుతాలు.. ధూపం నుంచి కంపోస్ట్ వరకు ఎన్నో ఉపయోగాలు..

ఇంట్లో పూజ చేసిన తర్వాత మిగిలిపోయే పూలను చాలామంది చెత్తలో పడేస్తుంటారు. కానీ ఆ ఎండిన పూలతో ఇంటికే ఉపయోగపడే ఎన్నో వస్తువులు తయారు చేసుకోవచ్చు.

పూజలో వాడిన పూలను బాగా ఎండబెట్టి పొడిలా చేసుకుని, అందులో కర్పూరం మరియు నెయ్యి కలిపితే మంచి సువాసన వచ్చే ధూపం తయారవుతుంది.

ఈ మిశ్రమాన్ని చిన్న కోన్‌ల రూపంలో చేసి మళ్లీ పూజలో ఉపయోగిస్తే ఇంటంతా ఆహ్లాదకరమైన వాసన వస్తుంది.

గులాబీ, మందారం వంటి పూల రెక్కలను ఎండబెట్టి సబ్బుల్లో కలిపితే సహజమైన సువాసనతో ఆర్గానిక్ సబ్బులు తయారవుతాయి.

ఈ పూలను రెసిన్ ఆర్ట్‌లో కూడా ఉపయోగించవచ్చు. ఫోటో ఫ్రేమ్‌లు, కోస్టర్లు లేదా చిన్న క్రాఫ్ట్ వస్తువులకు ఇవి అందాన్ని పెంచుతాయి.

కొన్ని ఎండిన పూలతో హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు. పూల పొడిని వేడి నీటిలో మరిగించి తేనె కలిపి తాగితే మంచి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఎండిన పూల రెక్కలను కొవ్వొత్తుల్లో కలిపితే అవి మరింత అందంగా కనిపిస్తాయి. ఇంటి అలంకరణకు కూడా ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఎండిన పూలతో సహజ ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు. ఇంటి మొక్కలకు సహజ పోషకంగా ఉపయోగించవచ్చు.

ఇలా పూజలో వాడిన పూలను పారేయకుండా మళ్లీ ఉపయోగించుకుంటే ప్రకృతికి మేలు చేయడంతో పాటు ఇంటికీ ఉపయోగకరమైన వస్తువులు సిద్ధమవుతాయి.