గోరింటాకు అంటే సహజమైన అందం అని చాలామంది భావిస్తారు. కానీ అదే హెన్నాను తరచుగా వాడితే జుట్టు ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
హెన్నాలో ఉండే టానిన్ అనే పదార్థం జుట్టుకు రంగు ఇవ్వడమే కాదు, సహజ తేమను కూడా తగ్గిస్తుంది. దీంతో జుట్టు క్రమంగా పొడిబారి గరుకుగా మారుతుంది.
తేమ కోల్పోయిన జుట్టు బలహీనంగా మారి సులభంగా విరిగిపోతుంది. తలస్నానం చేసినప్పుడు లేదా దువ్వేటప్పుడు ఎక్కువగా జుట్టు ఊడిపోవడం కనిపిస్తుంది.
హెన్నా జుట్టుపై ఒక పొరలా పేరుకుపోతుంది. మొదట జుట్టు ఒత్తుగా కనిపించినా, కాలక్రమంలో సహజమైన మెత్తదనం తగ్గిపోతుంది.
ముఖ్యంగా సిల్కీ హెయిర్ ఉన్నవారిలో జుట్టు గరుకుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజ ఆకృతి కూడా మారిపోయే పరిస్థితి వస్తుంది.
తల చర్మంపై హెన్నా ఎక్కువగా పేరుకుపోతే కుదుళ్లకు అవసరమైన గాలి, పోషకాలు సరిగా అందవు. దీని వల్ల జుట్టు పలచబడటం ప్రారంభమవుతుంది.
కొంతమందికి హెన్నా వల్ల దురద, ఎర్రటి మచ్చలు లేదా అలెర్జీలు రావచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
హెన్నా వేసిన తర్వాత కెమికల్ కలర్స్ సరిగా పట్టకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో జుట్టు వింత రంగులోకి మారే ప్రమాదం కూడా ఉంటుంది.
నెలకు ఒకసారి మాత్రమే హెన్నా వాడటం మంచిది. పెరుగు, కొబ్బరి నూనె కలిపి వాడితే జుట్టు పొడిబారకుండా ఆరో్యంగా ఉంటుంది.