పాతకాలం నుంచి ఇంటింటా చేసే చెక్క గారెలు ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. వేడి వేడి గా చట్నీతో తింటే ఈ రుచిని మర్చిపోలేరు.
మినప్పప్పు, పెసరపప్పుతో చేసే ఈ గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే శరీరానికి మంచి బలాన్ని కూడా ఇస్తాయని పెద్దలు చెబుతుంటారు.
ముందుగా మినప్పప్పు, పెసరపప్పును శుభ్రంగా కడిగి కొన్ని గంటలు నానబెట్టాలి. తరువాత నీరు పూర్తిగా వంపేయాలి.
నానిన పప్పులను మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు గారెలకు మంచి టెక్స్చర్ వస్తుంది.
ఈ మిశ్రమంలో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా కలిపితే రుచి పెరుగుతుంది.
చివరగా జీలకర్ర, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని చిన్న ముద్దలా తీసుకుని పలుచగా ఒత్తాలి.
పాన్‌లో నూనె వేసి మీడియం మంటపై ఈ గారెలను నెమ్మదిగా కాల్చాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి.
కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో ఈ గారెలు మరింత రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా బాగుంటాయి.
మినుములు, పెసర్లు అందరికీ ఒకేలా సెట్ కాకపోవచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది.